"న్యూ ఇయర్ 2023" లో కొత్త కొత్తగా !

VAMSI
మరో నాలుగు గంటల్లో పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరానికి అడుగుపెట్టబోతున్నాము. 2022 లో ఆఖరి రోజులో మనము ఉన్నాం ఈ క్షణం వరకు ఏమి జరిగింది అనేది మనకు తెలుసు. ఆ రోజులలో సంతోషం , బాధ, ఆనందం , దుఃఖం , లాభం, నష్టం ఇలా ఎన్నో విషయాలు జరిగి ఉండొచ్చు. జరిగిపోయిన వాటిని మనము తిరిగి తీసుకురాలేము... గతం గతః అని పేదవాళ్ళు ఊరికే చెప్పలేదు. ఒక్క సెకను జరిగిపోయినా తిరిగి రాదన్న విషయం అందరికీ తెలుసు. అందుకే కాలం చాలా విలువైనదని వేదాంతాలు పలుకుతుంటారు. వాస్తవంగా అదే నిజం... మనము వృధా చేసే ప్రతి ఒక్క క్షణం మన జీవితాన్ని నాశనం చేస్తుంది.
రేపటి నుండి రాబోయే కొత్త సంవత్సరాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ? ఎలా మనము నడుచుకోవాలి ? మన సక్సెస్ కు ఎటువంటి ప్రణాళికలు రచించుకోవాలి ? అన్న చాలా విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకుని పెట్టుకోవాలి. వాటిని అనుగుణంగా తీసుకుని ఏ విధంగా కొత్త సంవత్సరంలో ఉండకూడదు అన్నది ఇప్పుడు చూద్దాం.
* మనము మరియు మన చుట్టూ ఉన్న ఏ జీవిని కూడా అకారణంగా బాధపెట్టకూడదు. అప్పుడే వారితో పాటు మనము కూడా సంతోషంగా సుఖంగా ఉండగలం. ఇతరుల బాధలో మన సంతోషాన్ని వెతుక్కోకూడదు.
* ఇంతకు ముందు మన జీవితం ఏ విధంగా సాగింది అన్న విషయాన్ని మరిచిపోయి ఇకపై ఎలా అందరూ మన గురించి గొప్పగా మరియు మంచిగా మాట్లాడుకునేలా జీవించాలి అన్న విషయంపై మన దృష్టిని కేంద్రీకరించాలి.
* మనసులో కుటిలం, కుతంత్రం, ఈర్ష్య , అసూయ , కోపం , ద్వేషాలను పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ మీలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే వదిలేసి కొత్త జీవితానికి నాంది పలకండి.
* ఎదుటి మనిషిని ఎప్పుడైతే మీరు ప్రేమిస్తారో ... అప్పుడే ఒక మనిషిగా మీరు గెలిచినట్లు అని గుర్తుంచుకోండి.
* ఇతరులకు అవసరం అయినప్పుడు మీకు చేతనైనంత సహాయం చేయండి.. అప్పుడే మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.
* మనిషి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా లేదా చిన్న స్థాయి వారు అయినా ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి, అంతే కానీ బేధాన్ని చూపించడం తగదు.
ఇలా అన్ని విషయాలను సరిగా అర్ధం చేసుకుని ప్రవర్తిస్తే రానున్న కొత్త సంవత్సరం మీకు అంతా మంచినే కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: