విజయం మీదే: సమయం తిరిగి రాదు మిత్రమా... జాగ్రత్త

VAMSI
సమయాన్ని వృదా చేసేవాడు విజయాన్ని అందుకోలేడు. అసలే కాలంతో పరుగులు తీసే రోజులివి, అలాంటప్పుడు ప్రతి నిమిషాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత ఫలితాన్ని పొందుతారు. కాలం విలువ తెలుసుకుంటే విజయాన్ని అందుకున్నట్లే అన్నారు మహానుభావులు. కాలం దైవ స్వరూపం. మన జనన మరణాలు కాలం తోనే ముడిపడి ఉన్నాయన్నది అక్షర సత్యం. ఇపుడు చేయాల్సిన పనిని ఎపుడో చేస్తాను అంటే సమయం దాటిపోతుంది , వృదా అయిపోతుంది. ఉదాహరణకు ఒక బీటెక్ విద్యార్థి మంచి మార్కులతో చదువును పూర్తి చేశాడు. క్యాంపస్ సెలెక్షన్ లో సెలెక్ట్ అయిన ఇప్పుడే ఎందుకు కడటపడటం కొద్ది రోజులు సరదాగా ఎంజాయ్ చేసి తరవాత చేద్దాం అనుకున్నాడు.
ఆ తరవాత పెద్ద పెద్ద నగరాలకు వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే చదివిన చదువుకి మంచి ఉద్యోగం దొరుకుతుంది అయినా అంత దూరం వెళ్లి ఇపుడే ఎందుకు కష్టపడటం ఇక్కడే కొన్నాళ్ళు ఎదో ఒక జాబ్ చూసుకుందాం. ఆ తర్వాత చూసుకుందాం అని అనుకున్నాడు, అలా నాలుగైదు ఏళ్లు గడిచాక తనతో బీటెక్ పూర్తి చేసుకున్న వారు అంతా చదువుకు తగ్గట్లుగా..  మంచి మంచి జాబ్ లు చేస్తున్నారు, అందులోనూ ఎక్స్పీరియన్స్ పెరగడంతో మంచి సాలరీస్ కూడా వస్తున్నాయి. వాళ్లందరినీ చూసి అప్పుడు తనకు కూడా అలా లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా అన్ని సంవత్సరాలు సమయాన్ని వృదా చేయడం, ఎక్స్పీరియన్స్ లేకపోవడం తనకి జాబ్ దొరకడం గగనం అయ్యింది.
ఉద్యోగం కోసం తిరిగి తిరిగి విసిగిపోయాడు. తనతో చదువుకున్న వారంతా అప్పట్లో కష్టపడి ఇపుడు హాయిగా సంపాదిస్తూ సెటిల్ అయ్యారు, కానీ, తాను మాత్రం చాలా బాధపడుతూ తాను చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ బాధపడుతున్నాడు.  అప్పట్లో చేయాల్సిన ప్రయత్నం అప్పుడే చేసుంటే ఫలితం దక్కి ఉండేది. అందుకే సమయాన్ని అస్సలు వృదా చేయరాదు ఎపుడు చేయాల్సిన పని ఎపుడు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: