అద్దెకు అందమైన భార్యలు.. ధరెంతో తెలిస్తే ఫ్యూజులు అవుట్..!
అదే `అద్దె భార్యల` కాన్సెప్ట్. స్పష్టంగా చెప్పాలంటే అద్దెకు అందమైన భార్యలను తెచ్చుకోవడం. ఇది అధికారికంగా గుర్తింపు పొందిన వివాహం కాదు. చట్టపరమైన బంధం కూడా కాదు. కానీ, ఒక పురుషుడు ఒక మహిళను ఒక నిర్దిష్ట కాలం పాటు భార్యలా అద్దెకు తీసుకోవచ్చు. ఒప్పందం ప్రకారం ఆ మహిళ అతనికి నిజమైన భార్యగా అన్ని రకాల సేవలు అందిస్తుంది. వంట చేయడం, బయటకు తోడుగా వెళ్ళడం, అతని కుటుంబ జీవితాన్ని పోలి ఉండే వాతావరణం సృష్టించడం వంటి అన్ని పనులు చేస్తుంది. ఒకవేళ కాలక్రమంలో ఆ అమ్మాయిని లేదా స్త్రీని పర్యాటకుడు ఇష్టపడితే వారు వివాహం కూడా చేసుకోవచ్చు.
థాయిలాండ్‌లో పేదరికం, ఆర్థిక ఇబ్బందులు మహిళలను ఈ దిశగా నెట్టాయి. చాలామంది యువతులు బార్లు, నైట్‌క్లబ్‌లలో పని చేస్తూ పర్యాటకులతో పరిచయాలు ఏర్పరుచుకున్నారు. ఆ పరిచయాల ఆధారంగా అద్దె భార్యలుగా మారడం మొదలైంది. తాత్కాలిక ఫ్యామిలీ లైఫ్ అనుభవం కోరుకునే విదేశీయుల కోసం ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇకపోతే మహిళ వయస్సు, అందం, విద్య, కాల వ్యవధి మీద అద్దె అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది మహిళలు కొన్ని రోజులకే భార్యగా ఉంటారు. మరికొందరు నెలల తరబడి ఒప్పందం కింద ఉంటారు. అద్దె ధరలు $1,600 నుంచి $1,16,000 (సుమారు ₹1.4 లక్షల నుంచి ₹1 కోటి) వరకు ఉంటాయని తెలియడంతో నెటిజన్లకు ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. కాగా, థాయిలాండ్‌లో కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.