
Happy women's Day: ఆ రైల్వేస్టేషన్లో అందరూ మహిళా ఉద్యోగులే.. ఏపీలో ఎక్కడంటే..?
రైల్వే శాఖ మహిళా సాధికారతకు ఇదే నిదర్శనం అన్నట్లుగా చెప్పవచ్చు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో తమ స్వస్తితోనే ఆర్థికంగా నిలబడేలా ఎదుగుతున్నారు. ఇలా విద్య, వైద్యం, వ్యాపార రంగాలలో కూడా రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్రీడలు బాక్సింగ్ అంతరిక్షం టెక్నాలజీ సరికొత్త రంగాలలో కూడా మహిళలు సరికొత్త పొంతలు తొక్కుతూ అడుగులు వేస్తూ ఉన్నారు. పురుషులకు దీటుగానే అన్నిటిలో ముందుకు వెళుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే చంద్రగిరి రైల్వే స్టేషన్ ఇందుకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది.
చంద్రగిరి రైల్వే స్టేషన్ అటు స్టేషన్ మాస్టర్ నుంచి పాయింట్ విమాన్ దాకా అందరూ కూడా ఇక్కడ మహిళలే పని చేస్తూ ఉండడం గమనార్హం. ఇక్కడ ముగ్గురు స్టేషన్ మాస్టర్లు నలుగురు పాయింట్స్ తో పాటు ఒక సఫారీ వాలా కూడా స్టేషన్లో పనిచేస్తున్నారట. రోజు ఇక్కడ 38 ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు 13 ప్యాసింజర్ రైలు తిరుగుతూ ఉంటాయట. ఈ రైల్వే స్టేషన్ గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉంటుంది. ముఖ్యంగా చంద్రగిరి లోని రైల్వే స్టేషన్ శుభ్రతతో పాటు టికెట్లు విక్రమ్ రక్షణ కల్పించడం వంటి వాటిలో కూడా మహిళా ఉద్యోగులే ఉన్నారట. అలాగే అక్కడ ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నది.రైల్వే శాఖలో మొత్తం మీద 20% మంది మహిళలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.