![తిరుమలలో మరొకసారి వివాదం.. ఈసారి ఏం జరిగిందంటే..?](https://www.indiaherald.com/cdn-cgi/image/width=350/imagestore/images/viral/127/tirupati-dress-code-misbehavior-foreigner-lady47ebe1f6-00db-430f-ae27-7554cf8a9bb2-415x250.jpg)
తిరుమలలో మరొకసారి వివాదం.. ఈసారి ఏం జరిగిందంటే..?
శ్రీవారి దర్శనానికి డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా ధరించాలని సాంప్రదాయ దుస్తులు లేకుంటే దేవుడు దర్శనం ఉండదని గతంలో తెలియజేశారు. కానీ ఇప్పుడు సాంప్రదాయమైన దుస్తులు లేకున్నప్పటికీ వీఐపీ బ్రేక్ దర్శనానికి ఒక భక్తురాలని అనుమతించడంతో చాలా విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. 300 రూపాయల ప్రత్యేకమైన ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు సైతం సాంప్రదాయమైన దుస్తులతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవలసి ఉంటుంది.. ముఖ్యంగా పురుషులైతే ధోతి, కుర్తా పైజామా వంటివి ధరించాలి.. మహిళలకు అయితే పంజాబీ డ్రస్సు లేదా లంగా వోని చీరలు వంటివి ధరించాలట.
అయితే ఇటీవలే ఒక మహిళ టీషర్టు నైట్ ప్యాంటు వేసుకొని వీఐపీ దర్శనానికి రావడం అక్కడ టిడిపి సిబ్బంది దర్శనానికి అనుమతించడం వల్ల చాలామంది విమర్శలకు దారి తీసేలా చేసింది అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. వైకుంఠంలో పనిచేసే టిటిడి విజిలెన్స్ అధికారులు తీరు చూస్తూ ఉంటే సరిగ్గా పనిచేయలేదు అనే విధంగా భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవలే లడ్డు కల్తి వివాదం మొదలు ఎన్నో అపచారాలు వివాదాస్పదమైన సంఘటనలు తిరుపతిలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే లడ్డు కౌంటర్లు కూడా అగ్ని ప్రమాదం కూడా జరిగింది. అలాగే తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు కోడిగుడ్లు పలావ్ వంటి వాటితో తిరుపతికి చేరుతున్నప్పటికీ అక్కడ సిబ్బంది ఏం చేస్తుందో తెలియడం లేదని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. వీటికి తోడు శ్రీవారి ప్రధాన ఆలయం మీదుగా విమానాలు వెళ్లడం కొండ ప్రాంతాలలో డ్రోన్లు వంటివి ఎగరడం వల్ల చాలానే విమర్శలు వినిపిస్తున్నాయి.