HMPV వైరస్: నిర్లక్ష్యం వద్దు..భయపడొద్దు..ఇలా చేస్తే దారిదాపుల్లో రాని వైరస్.!

FARMANULLA SHAIK
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో చెప్పాల్సిన అవసరం లేదు. దీని కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తుకు వస్తే మాత్రం ఇప్పటికీ గుండె గుబేల్ మంటుంది జనాలకు.అక్కడక్కడా కోవిడ్ కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్ని ఇంకా మర్చిపోకముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ హ్యూమన్ మెటాన్యూమోHMPV పుట్టుకొచ్చి ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నహెచ్ఎంపీవీ వైరస్ HMPV హ్యూమన్ మెటానిమో వైరస్ భారతదేశంలోకి కూడా ప్రవేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది.భయపడాల్సిన విషయం ఏంటంటే ఇది సాధారణ శీతాకాలపు జబ్బుల లక్షణాలతోనే వ్యాపిస్తుంది. దీన్ని ప్రత్యేకంగా గుర్తించడం కష్టంగా మారింది. కనుక ముందుగానే ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.ఈ ప్రమాదకరమైన వైరస్ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అంటువ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరగా సోకే అవకాశాలు ఉన్నాయట.

అలాంటి వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏమిటంటే హెచ్ఎంపీవీ వైరస్ ఐదేళ్లలోపు చిన్నారులకు, రోగ నిరోధక శక్తి సరిగ్గా లేని వారికి, ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వైరస్ లక్షణాలను చూసినట్లయితే దగ్గు, జ్వరం, ముక్కు కారడం, ముక్కు దిబ్బడగా ఉండడం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి.అయితే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల HMPVతో పాటు ఇతర శ్వాసకోశ వైరస్ల నుండి తక్కువగా ప్రభావితమవుతారు.చేతులు శుభ్రంగా ఉంచుకోవడం,ముఖం, కళ్లు, ముక్కు, నోరు టచ్ చేయకుండా ఉండటం,వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండటం,స్వచ్చమైన వాతావరణం ఏర్పరుచుకోవటం,ఇమ్యూనిటీని పెంచుకోవటం,మాస్క్ ధరించడం,అవసరమైన సందర్భంలో టీకాలు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయని చెప్పవచ్చు.లక్షణాలు ఎక్కువగా ఉండి, శ్వాసలో సమస్యలు తలెత్తితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: