వైరల్:26 ఏళ్ళు నిందితుని పట్టించిన ఒక్క పెళ్లి పత్రిక..!

Divya
ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాల వాళ్ల భార్యను, కుటుంబం పిల్లలను సైతం హతమార్చేందుకు అటు మహిళలు, పురుషులు కూడా వెనకడుగు వేయడం లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఇలాంటి పనులు చేయడం వల్ల తప్పించుకున్న ఏదో ఒక రూపంలో చికెందుకు అవకాశం ఉన్నది.. తాజా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి లో జరిగిన ఒక సంఘటన 26 ఏళ్ల తర్వాత కేవలం ఒక పెళ్లి కార్డు ద్వారా అంతకుడిని పట్టించిందట. వాటి గురించి చూద్దాం.

పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానంతో కన్నబిడ్డను కూడా చూడకుండా ఆరు నెలల పసిబిడ్డను సైతం గొంతు నులిమి చంపిన ఒక సంఘటన అందరిని కలిసి వేస్తోంది.. అయితే వీరిని తోటలో పాతిపెట్టి కర్ణాటకలోని మారుమూల ప్రాంతంలో ఒక రైతు తోటలో పనిచేస్తూ తిప్పేస్వామి పేరు మార్చుకొని మరి అక్కడ నివసిస్తూ ఒక యువతిని పెళ్లి చేసుకుని ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చారట.. 26 ఏళ్లు కావడంతో అందరూ కూడా మర్చిపోయారు అనుకున్నారు.. పోలీసులు కూడా పట్టించుకోలేదనుకున్నారేమో రెండో భార్య కూతురు వివాహానికి సైతం రెండవ కుమార్తె వివాహం కోసం స్వగ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నేహితులని ఆహ్వానించగా ఆ మేరకు ఆహ్వాన పత్రిక కూడా పంపించారు దీంతో ఒక్కసారిగా దొరికిపోయారు తిప్పయ్య స్వామి.

26 ఏళ్ల తర్వాత కుమారుడిని చంపిన తండ్రి అంటూ అరెస్టు చేశారని దీంతో పోలీసులు సైతం రివార్డులు అభినందనలు కూడా అందుకున్నారు. గుడిబండ మండలం దీన్నే హట్టి గ్రామానికి చెందిన తిప్పేస్వామి 30 ఏళ్ల క్రితం తన మేనత్త కుమార్తె కర్రీయమ్మతో వివాహం జరగగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు భార్య ప్రవర్తన పైన అనుమానం రావడానికి.. తన చిన్న కుమారుడు శివలింగయ్య తనకు పుట్టలేదని భావించి ఎలాగైనా చంపాలని 1998 అక్టోబర్ 2న దసరా పండుగ రోజు సమీప పొలాలలో జమ్మి చెట్టుకి ప్రదర్శన చేయిద్దామని భార్య కుమారుడిని పిలుచుకు వెళ్లి అక్కడ తన భార్య ప్రదర్శనలు చేస్తున్న సమయంలో పిల్లాడిని లాక్కొని పరారయ్యారట. అలా మామిడి తోటలో తన కుమారుడు శివలింగయ్యను గొంతు నిలిమి చంపేశారట. అక్కడే గొయ్యి తీసి పారిచి పెట్టడంతో.. ఈ విషయం పైన భార్య కరియమ్మ 1998 అక్టోబర్ 18న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. ఈ మేరకు పోలీసులు గాలించిన కూడా ఆచూకీ చిక్కలేదట.

దీంతో తిప్పాయి స్వామి కర్ణాటకకు పారిపోయి అక్కడ మారుమూల గ్రామంలో జవారప్ప వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నారట. కృష్ణ గౌడ గా పేరు మార్చుకొని ఒక మహిళను వివాహం చేసుకొని తులసి, సౌమ్య అనే ఇద్దరు కుమార్తెలకు జన్మించారట. అయితే తన స్వగ్రామంలో నాగరాజుతో స్నేహం వదలలేదని అయితే తమ కేసు పైన ఎలాంటి విషయాలు పట్టించుకోలేదని పోలీసులు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారని ఊరికి వచ్చి భూమి భాగాలు పరిష్కారం చేసుకోవాలని స్నేహితుల సలహా ఇవ్వడంతో.. తిప్పేస్వామి నాలుగు నెలల క్రితం చిన్న భార్య తార కూతురు వివాహం ఉందని ఆహ్వాన పత్రికను సైతం పంపించారట. నాగరాజు అతని భార్య తిప్పయ్య స్వామి కూతురు వివాహానికి హాజరై వచ్చారని విషయం పోలీసుల వరకు వెళ్లడంతో నాగరాజు కుటుంబ సభ్యులతో పక్కా సమాచారాన్ని అందుకొని పోలీసులు చేదించి మరి పట్టుకున్నారట.. 26 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకున్న తిప్పయ్య స్వామి అలియాస్ కృష్ణ గౌడ్ అన్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర సిఐ రాజకుమార్ ఎస్సై ముని ప్రతాప్ తదితర సిబ్బంది పట్టుకోవడంతో అభినందించి రివార్డులు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: