చిరు.. బాలయ్య.. వెంకీ : అతి పెద్ద బాక్సాఫీస్ వార్.. చివరికి గెలిచిందెవరు..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండుగ వచ్చింది అంటే స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇక 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి , బాలయ్య , వెంకటేష్ హీరోలుగా రూపొందిన సినిమాలు విడుదల అయ్యాయి. మరి భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ హీరోల సినిమాలు ఏవి .? అందులో ఏ సినిమా చివరగా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు , వెంకటేష్ హీరోగా రూపొందిన దేవిపుత్రుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఈ మూడు సినిమాలపై కూడా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలలో చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు సినిమాకు ఫ్లాప్ టాక్ రాగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు మూవీ కి బ్లాక్ బస్టర్ ట్రాక్ వచ్చింది. ఇక దేవీపుత్రుడు సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. 

దానితో ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవగా , బాలకృష్ణ హీరో గా రూపొందిన నరసింహ నాయుడు సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక దేవీపుత్రుడు సినిమా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లను వసూలు చేసి యావరేజ్ మూవీ గా నిలిచింది. దానితో 2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన మృగరాజు  నరసింహ నాయుడు , దేవీపుత్రుడు సినిమాలలో బాలకృష్ణ హీరో గా రూపొందిన నరసింహ నాయుడు సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: