కిల్లింగ్ సెల్ఫీ.. రెప్పపాటులో ఘోరం.. వైరల్ వీడియో?

praveen
నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో మొబైల్ కి అందరూ బానిసగా మారిపోయారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. అయితే ఇది నిజం తెలిసినప్పటికీ ఎవరు కూడా ఆ మొబైల్ కి దూరంగా ఉండలేకపోతున్నారు.  కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే చేసే వెసులుబాటు ఉండటంతో ఇక బయట ప్రపంచం గురించి ఎవరు ఆలోచించడం లేదు. వినియోగదారుల అభివృద్ధిలకు అనుగుణంగానే ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త మొబైల్స్ ని మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.

 దీంతో మనుషులు అటు మొబైల్ ని వదలలేని పరిస్థితి ఏర్పడింది. అయితే నేటి రోజుల్లో మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫీ అనే ఒక పిచ్చి అలవాటు పట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా అది సెల్ఫీ కెమెరాలో బంధించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతున్నారు  అయితే ఇలాంటి సెల్ఫీలతో కొంతమంది సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవాలని కూడా అనుకుంటున్నారు. చివరికి ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీ తీసుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక కిల్లింగ్ సెల్ఫీ గురించి. కిల్లింగ్ సెల్ఫీ అని నేను చెప్పడం కాదు ఈ వీడియో చూసిన తర్వాత మీరే అంటారు. ఐదుగురు యువకులు రైల్వే ట్రాక్ పక్కన ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే వినూత్నంగా సెల్ఫీ తీసుకోవాలని భావించారు. రైలు సమీపానికి రాగానే ఇక ఫోటో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పెడితే ఇక వైరల్ అవ్వచ్చు అని ఫిక్స్ అయ్యారు. ఇక దూరంగా రైలు రావడం చూసి అంతా రైలు పట్టాలపై నిలబడ్డారు. కానీ రెప్పపాటు కాలంలో ఘోరం జరిగిపోయింది. అత్యంత వేగంగా దూసుకొస్తున్న రైలు యువకుడిని ఢీ కొట్టింది. దీంతో మిగతా వారంతా భయంతో పక్కకు పరుగులు తీశారు. దీంతో ఇది చూసి అందరూ భయపడి పోయి కిల్లింగ్ సెల్ఫీ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: