వైరల్: వింత వాహనంతో దర్శనమిచ్చి షాకిచ్చిన నెటిజన్.!

FARMANULLA SHAIK
సోషల్‌ మీడియా పుణ్యమా అని రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఔత్సాహికులు తమ టాలెంట్‌ను దాచేయకుండా వాటిని నలుగురికీ తెలియజేయడానికి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. నెటిజన్ల ప్రశంసలతో పాటు వాటితో సక్సెస్‌ను కూడా అందుకుంటున్నారు. ఇటీవల ఓ యువకుడు మామూలు కారును రోల్స్‌ రాయిస్‌ కారులా మార్చిన సంగతి తెలిసిందే.ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వేదికగా సామాన్యులు చేసిన ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వీటిని ఇలా కూడా మార్చవచ్చా.. అని ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతుంటారు. ముఖ్యంగా ఆటో మొబైల్‌ రంగంలో ఇలాంటి ఆవిష్కరణలు కోకొల్లలు.
ఓ జంట తమ కారు క్యాబిన్‌ లోపల ఓ చిన్న బెడ్‌ రూమ్‌నే ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. ఇంకొకరు ట్రయాంగిల్‌ షేప్‌లో వీల్స్‌ను తయారు చేసి వాటిని సైకిల్‌కు రూపొందించారు. టైర్లు ఎప్పుడూ వృత్తాకారంలోనే ఉండాలని ఎందుకు భావించాడో ఏమో ఇలాంటి పనికి పూనుకుని విజయం సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో కనిపిస్తుంటాయి.సాధారణంగా వాహనం సైజ్, బరువును బట్టి తయారీదారులు వాహనాలను టైర్ల సైజు, షేప్‌ను నిర్ణయించి వాటికి అమరుస్తారు. వాహనం రోడ్డుపై రయ్‌ మంటూ దూసుకెళ్లడంలో టైర్లదే ప్రధాన పాత్ర. కానీ ఇక్కడ ఓ యువకుడు అలా కాదు.. తన బైక్‌ కంటే ఎక్కువ ఎత్తులో ఉండే టైర్‌ను బైక్‌కి అమర్చి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.వీడియో చూసిన కొందరు నెటిజన్లు అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శివ పుష్కర్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి వెరైటీ బైక్ మీద ప్రయాణిస్తున్నాడు. చాలా ఎత్తులో కూర్చొని ఈ వింత వాహనాన్ని డ్రైవర్ నడపాలి. ఎందుకంటే ఆ వాహనానికి ముందు వైపు ట్రాక్టర్ చక్రం అమర్చాడు. వెనుక వైపు స్కూటర్ చక్రం బిగించాడు. ఓ సాధారణ మోటర్ బిగించి ఈ వాహనాన్ని నడుపుతున్నాడు. రోడ్డు మీద ఈ వింత వాహనంపై ప్రయాణిస్తున్న ఆ వ్యక్తిని చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న వేరే వ్యక్తి ఆ వింత వాహనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.ఇదిలావుండగా ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. సరైన సమయానికి కిందకు దిగకపోతే పడిపోవడం ఖాయం, ఈ వాహనాన్ని పార్క్ చేయడం ఎలా, దాని మీద ఇద్దరు ప్రయాణం చేయవచ్చా, ఈ వాహనం వల్ల ఉపయోగాలు ఏంటి, ట్రాఫిక్‌లో దీనిని నియంత్రించడం సాధ్యమేనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: