రూ.40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే తోపు హీరోయిన్..?
అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పార్టిసిపేట్ చేసి విజేతగా నిలిచి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి అరంగేట్రం చేసింది. తన అందం, అభినయంతో చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే హాలీవుడ్ లోనూ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటిస్తూ అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది.
దాదాపు ఒక్కో సినిమాకు రూ. 40 కోట్లకు పైనే పారితోషికం అందుకుంటుంది. మొదట తమిళంలో సినిమాల్లో చేసిన ప్రియాంక చోప్రా అనంతరం బాలీవుడ్ కు మారింది. ఆ తర్వాత హాలీవుడ్ లోనూ రాణిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ప్రియాంక చోప్రా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఏలింది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.
రామ్ చరణ్ సరసన కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలలో ముందు వరుసలో ప్రియాంక చోప్రా ఉంది. ఈ బ్యూటీకి విపరీతంగా ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో చాలా సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రియాంక పోస్ట్ చేసే ఫోటోల కోసం సోషల్ మీడియాలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.