విప్ వ‌ద్దు.. మంత్రే ముద్దంటోన్న టీడీపీ ఎమ్మెల్యే.. ?

RAMAKRISHNA S.S.
- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . .
విశాఖ జిల్లాలోని సీనియర్ శాసనసభ్యుడు గ‌ణ‌బాబు .. ఆయ‌న ఇప్పటికీ నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. బీసీ వర్గానికి చెందిన గణబాబు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి.  ఆ కుటుంబం టిడిపితో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం పెంచుకొని ఉంది. విశాఖ జిల్లాలో గ‌వ‌ర‌ సామాజిక వర్గం బలంగా ఉంది. నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆ సామాజిక ప్రభావం చాలా ఎక్కువ. అయితే ఆ సామాజిక వర్గానికి 15 ఏళ్లుగా మంత్రి పదవి ద‌క్క‌డం లేదు. టిడిపి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మంత్రి యోగం లేదు. గణబాబు విశాఖపట్నం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 2014లో గెలిస్తే అప్పుడు విప్‌ పదవినే ఇచ్చారు. 2024లో టిడిపి మరోసారి అధికారంలోకి వచ్చింది. అయినా ఆయ‌న మంత్రి కోరిక నెర‌వేర లేదు.

ఇప్పుడు కూడా విప్‌ పదవి ఇచ్చారు. దాంతో విప్ గానే గణబాబు తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఎందుకో ఆయన అంత సంతోషంగా లేరు. ఆయనను అభినందించడానికి వెళ్లిన పలువురు రాష్ట్రస్థాయి నేతలు ఆయనకు అభినందనలు చెబుతూనే ఈసారి విప్ కాదు తొందరలోనే మంత్రి కావాలని కోరుకున్నారు. వాస్తవానికి గణబాబు మనసులో కూడా ఇదే ఉందని ... ఆయన ఎప్పటికైనా సన్నిహితులతో తనకు ఎప్పుడు మంత్రి పదవి వస్తుందా ? అని చర్చించారని కూడా తెలుస్తోంది. పార్టీలో విధేయత ఉంటున్న ఆయ‌న‌కు మంత్రి పదవి ఇవ్వటం కరెక్ట్ అని పార్టీలోనే చర్చ జరుగుతుంది. గణబాబు వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్నారు. 2019లో ప్రతికూల‌ పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విస్తరణలో అయినా గణ‌బాబు కు మంత్రి పదవి వస్తుందని చాలామంది కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: