మాతృత్వం అనేది మధురమైన అనుభవం. పెళ్లైన ప్రతి మహిళా తాను గర్భం దాల్చాలని భావిస్తుంది. పుట్టిన బిడ్డను తన పొత్తిళ్లలో ఆడించాలని, వారికి తన తల్లి ప్రేమను అందించాలని భావిస్తుంది. బోసి పాపాయి నవ్వులు చూసి మురిసి పోతుంది. ఇలా ప్రతి మహిళా తన మాతృత్వాన్ని ఎంతో ఆరాధిస్తుంది. అయితే గర్భం దాల్చక చాలా మంది మహిళలు నిరాశలో కూరుకుపోతారు. తమ సమస్య ఏమిటో తెలుసుకోవాలని ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. దీంతో మాతృత్వపు అనుభవాన్ని పొందలేకపోతున్నామని బాధ పడుతుంటారు.
అయితే గర్భం దాల్చితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏ మాత్రం పొరపాట్లు జరిగినా అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ అయితే ఏ మహిళా తట్టుకోలేదు. ఇలా కాకుండా కవలలు పుడితే వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఇలాగే ఓ మహిళ గర్భం దాల్చింది. ఆమె కడుపు భారీగా ఉంది. దీంతో ఆమె కడుపులో 18 మంది పిల్లలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. తీరా అసలు విషయం తెలిసి అంతా షాక్కు గురయ్యారు. చివరికి ఊహించని విషాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గర్భంలో కవలలు ఉంటే మహిళ కడుపు కొంచెం పెద్దగా ఉంటుంది. ఏ మహిళకు అయినా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఒకేసారి పుడతారు. అంతకు మించి పిల్లలు పుడితే అది నిజంగా ఆశ్చర్యమే. అయితే ఓ మహిళ కడుపు మాత్రం ఎవరూ ఊహించనంత భారీగా పెరిగింది. తొలుత ఆమె గర్భంలో 18 మంది పిల్లలు ఉన్నారని అంతటా ప్రచారం సాగింది. బాధిత మహిళ కడుపు బెలూన్లా ఉబ్బి పోయింది. వీడియో ప్రకారం ఈ మహిళ అమెరికాలోని టెక్సాస్ నివాసి. వీడియో ప్రారంభంలో మహిళ ప్రజలకు ఏదో చెబుతోంది. అయితే బ్యాక్గ్రౌండ్లో ఇంకొన్ని మ్యూజిక్ ప్లే అవుతోంది. పెద్ద బెలూన్లా విస్తరించి ఉన్న తన పొట్టను ఆ మహిళ చూపిస్తోంది.
ఆ మహిళ వెనుక సన్నగా డాక్టర్ లాంటి వ్యక్తి కూడా కనిపిస్తాడు. అతను స్త్రీతో మాట్లాడుతున్నాడు. చివరికి అయితే ఆ మహిళ కడుపులో ఉన్నది పిల్లలు కాదని, పెద్ద కణితి ఉందని తేలింది. ఇది వాస్తవమో కాదో స్పష్టత లేదు. చివరికి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఆ మహిళ గురించి మరో భయంకరమైన నిజం తెలిసింది. వీడియో చిత్రీకరించిన కొద్ది సేపటికే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది.