వైరల్: 27 దేశాలనే వణికిస్తున్న కోవిడ్ వైరస్.. లక్షణాలివే..!

frame వైరల్: 27 దేశాలనే వణికిస్తున్న కోవిడ్ వైరస్.. లక్షణాలివే..!

Divya
కరోనా వైరస్ వచ్చిన తర్వాత.. చాలా వైరస్లు కొత్తగా పుట్టుకొస్తూ ఉన్నాయి. దీంతో ప్రజలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా అత్యంత ప్రమాదకరమైనటువంటి XEC కోవిడ్ వేరియంట్ వైరస్  పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ పలువురు ఆరోగ్య నిపులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. మొదట జర్మనీలో XEC కోవిడ్ వేరియెంట్ గుర్తించారంటూ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ వంటి ప్రాంతాలలోనే కాకుండా యూరప్ వంటి ప్రాంతాలలో కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుందని తెలియజేస్తున్నారు.

ఇప్పటికే సుమారుగా 27 దేశాలకు సైతం XEC వైరస్ వ్యాప్తి చెందిందని ఇది కరోనా వేరియంట్లులో ఒక భాగం అన్నట్లుగా తెలిపారు.ఇప్పటికే 500 మంది శాంపిల్స్ కూడా సేకరించామంటూ అక్కడి ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్  కు సంబంధించిన ఒక కొత్త వేరియంట్ వైరస్ అన్నట్లుగా తెలియజేస్తున్నారు. గతంలో ప్రబలిన ఓమిక్రమ్ సబ్ వేరియంట్లలో ఇది KS -1.1,KP -3.3 తరహాలోనే ఇది ఉంటుందన్నట్లుగా తెలియజేస్తున్నారు సైంటిస్టులు.

XEC కేసులు ఎక్కువగా పోలాండ్, ఉక్రెయిన్, పోర్చుగల్ చైనా ఇతరత్రా దేశాలలో ఎక్కువగా నమోదవుతున్నాయట ఇటీవల వచ్చిన కోవిడ్ వేరియంట్ కంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది అంటూ లండన్ నిపుణులు తెలియజేస్తున్నారు. XEC కరోనా వేరియెంట్ సోకిన వారిలో కచ్చితంగా జ్వరము, గొంతు నొప్పి, దగ్గు, వాసన కోల్పోవడం వంటితో పాటు బరువు సడన్గా తగ్గిపోవడం, ఒళ్ళు నొప్పులు వంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయట. ఇది ఓమిక్రన్ వేరియంట్ కు చెందిన వైరస్ కావడం చేత వ్యాక్సిన్లు బూస్టర్ లతోనే రక్షణ కల్పించుకోవాలి అంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా స్వచ్ఛమైన గాలి నీ పీల్చుకోవాలి అంటూ అమెరికా వైద్యులు తెలియజేస్తున్నారు. అందుకే అంటే దేశాలలోని ప్రజలను కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: