తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి అత్యధికంగా పెరగడంతో జరిగినటువంటి తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించిన సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షకు పైగా భక్తులు రావడంతో తొక్కిసలాట ఏర్పడింది. చాలాసేపు కంపార్ట్మెంట్లలో ఉంచి ఒకేసారి జనాల్ని వదిలేయడంతో ఈ తొక్కి సలాట ఘటన జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం ఈ తొక్కిసలాటలో ఆరుగురికి పైగా మరణించారని తెలుస్తోంది. చాలామందికి గాయాలైనట్లు సమాచారం అందుతుంది. మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి పంపించారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం తిరుపతిలో ఏదో ఒక ఘటన వల్ల సంచలనం అవుతోంది. దీనికి అంతటికి కారణం సిబ్బంది నిర్లక్ష్యమే అయినట్టు తెలుస్తోంది.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చిన భక్తుల తాకిడి వల్ల పోలీసులు సరైన సమయానికి స్పందించకపోవడం వల్లే ఈ ఘటన ఏర్పడినట్టు సీఎం కి ఇచ్చిన నివేదికలో వెళ్లడైంది.. డీఎస్పీ నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని, ఆయన సరైన సమయానికి స్పందించి ఉంటే ఇంతటి ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు అంటున్నారు. అంతేకాదు తిరుపతికి సంబంధించినటువంటి సిబ్బంది డిఎస్పి వైఖరి పై ఎస్పీ సుబ్బారాయుడు కు మరియు కలెక్టర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంతటి విపత్తు జరిగిన కానీ ఆ సమయంలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ప్రాణాష్టం పెరిగిందని తెలుస్తోంది.
ఇక ఈ జరిగాక కూడా డిఎస్పి సరిగ్గా స్పందించలేదని తెలుస్తోంది.ఏది ఏమైనా ఇండియా మొత్తం నుంచి తిరుపతి దర్శనానికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అలాంటి ఈ దేవస్థానం వద్ద ఇంతటి నిర్లక్ష్యం చేయడం వల్ల భక్తులకు అనేక ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రాణాలు కూడా పోతున్నాయి.. దీనిపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతికి ముగ్గురు మంత్రులను వెళ్లాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం కళ్లా ఆయన రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి భక్తులను పరామర్శించనున్నారు. మరి చూడాలి ఈ ఘటన విపక్షాలు ఏ విధంగా స్పందిస్తారో