వైరల్: ఏపీలో దేవుడి ముందు అసభ్యకర నృత్యాలు.. ఏకంగా 7 మంది పై కేసు..!

Divya
వినాయకుడు పండుగ అంటే హిందువులకు చాలా ఇష్టమైన పండుగ.. ముఖ్యంగా వినాయకుడిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేసే వరకు చాలా హంగామా చేస్తూ ఉంటారు. వినాయక నవరాత్రి ఉత్సవాలలో కూడ   భక్తిశ్రద్ధలతో సైతం దేవుడిని పూజిస్తూ ఉండడమే కాకుండా కొంత మంది భజన, కోలాటాలు ఇతరత్రా వాటిని చేస్తూ ఉంటూ భక్తిశ్రద్ధలతో మునుగుతూ ఉంటారు. కానీ రాను రాను కొంతమంది చేస్తున్న పనుల వల్ల విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. గణేశుని మండపం దగ్గర సినిమా పాటలు పెడుతూ డాన్సులు వేస్తూ ఉన్నప్పటికీ.. రికార్డింగ్ డాన్సులు మరింత అస్లీలతకు దారితీస్తున్నాయట.

ఇప్పుడు తాజాగా తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలలో చేసిన ఒక రికార్డింగ్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా అస్లీలనృత్య ప్రదర్శనలు చేసినట్టుగా ఈ వీడియోలో కనిపించడంతో వెంటనే కేసు నమోదు చేశారు. సుమారుగా 7 మంది నిర్వాహకులకు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసినట్లు అలిపిరి పోలీసులు సైతం తెలియజేస్తున్నారు.. తిరుపతిలోని సప్తగిరి నగర్ లో ఈ సంఘటన జరిగినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. వినాయకుడు మండపంలోనే ఇదంతా జరుగుతూ ఉండడంతో కేసు ఫైల్ చేసినట్లుగా తెలియజేశారు.

ముఖ్యంగా ఇలాంటి డాన్స్ తరహాలో మరొక స్టేజిని ఏర్పాటు చేసుకోకుండా వినాయకుడు ముందే మండపంలో ఇలాంటి యువతులు అశ్లీల నృత్యాలతో డాన్స్ చేయడమే కాకుండ , మద్యం తాగడం వంటివి చేశారట. దీంతో అక్కడికి వచ్చిన భక్తుల సైతం తీవ్ర అసతృప్తితో ఉన్నారట. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన పైన తిరుపతి పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఎస్పి సుబ్బరాయుడు.. రాంప్రసాద్, ఎం వినోద్ కుమార్, జై మధుసూదన్ రెడ్డి, జి కిరణ్ కుమార్, పి వినయ్, జస్వంత్ రెడ్డి, హేమంతుల పైన కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు వీరిని అరెస్ట్ కూడా చేసినట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: