పోతే ఒక్కడినే.. వస్తే పదిమంది.. ఈ జెసిబి డ్రైవర్ నిజంగా వారియర్?
ఇక ఎంతోమంది ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య అటు అధికారులు ఎన్నో రకాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందిస్తూనే ఇంకోవైపు ఇలా వరదా ప్రవాహం నుంచి ఎంతోమందిని కాపాడి ప్రాణాలను నిలబెడుతున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది మాత్రం హమ్మయ్య.. మేము వరదల నుంచి బయటపడడం అంటూ ఇతరుల గురించి ఆలోచించకుండా కాస్త స్వార్ధంగా ఆలోచిస్తుంటే.. ఇంకొంతమంది మాత్రం ఏకంగా వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేసేందుకు ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
ఈ క్రమంలోనే రియల్ హీరోలుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. పోతే నేనొక్కడినే పోతాను కానీ వస్తే నాతో పాటు పదిమందిని కాపాడుతాను అంటూ ఒక జెసిబి డ్రైవర్ చేసిన సాహసం గురించి తెలిసి ప్రతి ఒక్కరు హాట్సాఫ్ చెప్పేస్తున్నారు. ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని ఒక్కడే వెళ్లి కాపాడాడు. అతనే జెసిబి డ్రైవర్ సుభాష్. అధికారులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు చేయలేని పనిని ఒక సామాన్యుడు,ఒక డ్రైవర్ చేశాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా విపత్తులో ఉన్న తొమ్మిది మందిని కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. దీంతో అతని తెగువకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు ఇంటర్నెట్ జనాలు.