నిజంగా ఈ భర్త మగ జాతి ఆణిముత్యం.. ఎందుకో మీరే చూడండి?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక క్యూట్ కపుల్ కి సంబంధించిన ఫన్నీ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అందులో భర్త, భార్యల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, గిల్లికజ్జాలను, చిలిపి చేష్టలను చాలా హాస్యంగా చూపించారు. ఈ వీడియో చూసిన చాలామంది తమ ఇంట్లో జరిగే సంఘటనలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. అంటే, ఈ వీడియో చాలా సాధారణమైన జీవితాన్ని చాలా ఫన్నీగా చూపించింది.
ఈ https://twitter.com/HasnaZaruriHai/status/1827696854110196193?t లింకు పైన క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు. ఈ వీడియోను భర్తే పోస్ట్ చేశాడు. ఆ వీడియో చాలా మందికి నచ్చింది. ఆ వీడియోలో ఆయన తన భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో చాలా ఎమోషనల్ గా చెప్తాడు. భార్యతో కలిసి నడుస్తూ, ఆమె చేతిని పట్టుకుని, కారు తలుపు తెరిచి ఇస్తూ, ఆమె ఎంత మంచిదో చెప్తూ ఒక మంచి హస్బెండ్ లాగా కనిపిస్తాడు. కానీ వీడియో చివరికి వచ్చేసరికి ఆయన తన భార్య వల్ల చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తన కారును చాలా వేగంగా నడిపి, కారు నుంచి దూకి చనిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పి అపరిచితుల్లో విక్రమ్ లాగా ట్విస్ట్ ఇస్తాడు. ఈ వీడియో చూసినా చాలామంది అసలైన మగజాతి ఆణిముత్యం అంటే నువ్వే భయ్యా అని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన చాలామంది, మా ఇంట్లో జరిగే గొడవలు ఎలా ఉంటాయో అలానే ఈ వీడియోలో చూపించారని చెప్పారు. ఒకరు, "ఇప్పుడు వీళ్ళకి నిజంగా గొడవ జరుగుతుంది. ఇప్పటికే భర్తకి బాగానే చివాట్లు పడి ఉంటాయి" అని జోక్ చేశారు. మరొకరు ఈ వీడియో కింద మెసేజ్‌లో, "సంతోషంగా ఉండే జీవితానికి రహస్యం ఏమిటో తెలుసా? ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది తెలుసుకోవడం" అని రాశారు. అంటే, భర్తలు, భార్యలు రోజూ జీవితంలో ఎన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలో ఈ వీడియో చూపిస్తుంది. కొన్ని గంటలకు షేర్ చేసిన ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దీనికి కపుల్ ఫ్యామిలీ పర్సన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. దీనిని మీరు కూడా చూసేయండి