క్రియేటివిటీ తగలెయ్యా.. ఇలాంటి ఆలోచన మీకు కలలో కూడా వచ్చుండదు?

praveen

భారతీయుల క్రియేటివిటీకి ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే. ఈ రోజుల్లో వెడ్డింగ్ వీడియోలను మరింత క్రియేటివ్ గా మార్చుతున్నారు. దేవుళ్లు వధూవరులపై పూలు చల్లినట్లు, అంతరిక్షం పైన పెళ్లి చేసుకున్నట్లుగా వధూవరుల వీడియోలను ఎడిట్ చేసి వెళుతున్నారు వారి క్రియేటివిటీకి నెటిజన్లు అవాక్కవుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఒక ఫన్నీ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక పెళ్లి కూతురు తన భర్తతో కలిసి తన ఇంటి నుంచి రాకెట్ మీద వెళ్లిపోతున్నట్లు చూపించారు. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలు అయ్యేలా మీరు నవ్వుకోక తప్పదు. అయితే, ఇది నిజం కాదు. ఈ వీడియోను కేవలం ఫన్ కోసం అనిమేషన్ చేశారు. ఇలాంటి ఆలోచన మనకి కలలో కూడా వచ్చి ఉండదు అని చెప్పుకోవచ్చు.
సాధారణంగా పెళ్లి కూతురు తన ఇంటి నుంచి అందంగా అలంకరించిన కారులో లేదా పల్లకిలో వెళ్తుంది కదా. కానీ ఇక్కడ జరిగింది మాత్రం చాలా ఫన్నీ దృశ్యం కనిపించింది! ఈ వీడియోలో, కొత్తగా పెళ్లైన వరుడు ముందు కూర్చుని తన భార్యను వెనక కూర్చోమని అడుగుతాడు. ఆ తర్వాత ఒక మనిషి వచ్చి రాకెట్‌కు నిప్పు పెడతాడు. అంతే, రాకెట్ గాల్లోకి ఎగిరిపోతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళంతా నవ్వుల పగలబడి నవ్వుతున్నారు.
ఆ వీడియోను ఎక్స్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో "ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్" అని రాసి పోస్ట్ చేశారు. ఈ వీడియోను 9 లక్షల మందికి పైగా చూశారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. కొంతమంది "ఇండియన్ క్రియేటర్స్ రాక్, ఇతర క్రియేటర్స్ షాక్" అని నవ్వుతూ కామెంట్ చేశారు. మరికొందరు "వాళ్ళని మరో దేశానికి పంపించడానికి నిజమైన మిస్సైల్‌ని ఉపయోగించి ఉండాలి" అని వ్యాఖ్యానించారు. మరికొందరు "ఎడిటింగ్ చాలా బాగుంది" అని కామెంట్ చేశారు. చాలా మంది కొత్తగా పెళ్లి కూతురు భర్త చాలా తెలివైనవాడు అని, వీళ్ళిద్దరూ చాలా ఫన్నీగా ఉన్నారని ప్రశంసించారు. ఈ https://twitter.com/Masterji_UPWale/status/1827397206023840187 లింకు పైన క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: