హిందీలో మాట్లాడితే ఆటో ఛార్జ్ రూ. 50 ఎక్కువ.. ఎక్కడో తెలుసా?

praveen
సాధారణంగా మహానగరాలు అన్న తర్వాత ఏకంగా దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది ఉద్యోగం కోసం లేదంటే వ్యాపార చేయడం కోసం తరలివస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ మహానగరంలో చూసిన కేవలం ఆ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే కాదు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్లు తారసపడుతూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది అయితే వారి సొంత ప్రాంతాలను సైతం వదిలేసి ఇక ఇలా మహానగరాలలోనే సెటిల్ అయిపోతూ ఉంటారు.

 ఇలా ఎక్కువమంది ఉద్యోగాలు చేసేందుకు వెళ్లే మహా నగరాలలో హైదరాబాద్ ఎలా అయితే ఒకటో.. ఇక బెంగళూరు మహానగరం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది విద్యావంతులు ఇక్కడ కంపెనీలలో ఉద్యోగాలు చేసేందుకు వెళుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులో అటు లివింగ్  కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎంతోమంది ఇలాంటి మహా నగరాలు ఉద్యోగం చేసేందుకే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే కర్ణాటకలోని బెంగుళూరు నగరంలో ఏకంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడే ఉంటున్న వారికి ఎంత తేడా ఉంది అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. బెంగళూరులో చాలామంది ఉద్యోగాలు చేసేందుకు వెళ్లగా.. అక్కడ ఇతర రాష్ట్రాల వారికి భాష సంబంధిత ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఉండాలంటే కన్నడ మాట్లాడాల్సిందేనని.. క్యాబ్ ఆటో డ్రైవర్లు ప్రశ్నించిన వీడియోలు ఫైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇక తాజాగా మరో వీడియో కూడా చక్కర్లు కొడుతుంది. అందులో ఆటోవాలాలు కన్నుల మాట్లాడే వారి కంటే హిందీలో మాట్లాడే వారి దగ్గర 50 రూపాయలు ఎక్కువగా ఛార్జ్ తీసుకుంటూ ఉండటం గమనార్హం. కొంతమంది యూట్యూబ్లో ఇక ఇందుకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: