ఆ దేశంలో పొరపాటున కూడ జీన్స్ ధరిస్తే.. జైలు శిక్షే..!

Divya
కొన్ని దేశాలలో కొన్నిటిని బ్యాన్ చేయడం సర్వసాధారణంగా మారుతూ ఉంటుంది. కొన్ని దేశాలలో కొన్ని దుస్తులను, ఆహారాలను పరికరాలను సైతం బ్యాన్ చేస్తూ ఉంటారు. ఉత్తర కొరియాలోని ప్రాంతాలలో నివసించేవారు జీన్స్ ని అసలు వేసుకోకూడదట. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 20వ శతాబ్దంలోనే కొరియా రెండు దేశాలుగా విడిపోయిందట.. ఒకటి దక్షిణ కొరియా, మరొకటి ఉత్తర కొరియాగా పిలువబడుతున్నాయి. ప్రతి దేశం కూడా అమెరికా వంటి వాటితో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా.. ఆహారం, విద్యా, టెక్నాలజీ, ఫుడ్ ఇతర అంశాలతో కూడా ఆ దేశం పైన ఎక్కువగా ప్రభావం ఉన్నదట. అందుకు విరుద్ధంగానే ఉత్తర కొరియా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది.

ఇక దక్షిణ కొరియా అమెరికాకి మిత్ర దేశంగా ఉన్నది.. కానీ ఉత్తర కొరియా మాత్రం అమెరికాకు పూర్తిగా విరుద్ధంగానే ఉంటుంది. ఆ దేశంలో సన్నిహిత్యంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఉత్తరకొరియా వ్యతిరేకిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ సాంస్కృతిని తమ దేశం పైన పడటానికి అస్సలు సహించదు ఉత్తరకొరియా. ఇందులో భాగంగానే జీన్స్ దుస్తులను అమెరికాకు సంబంధించి ఫ్యాషన్ కావడం చేత ఇది ఉత్తర కొరియా దృష్టిలో వీటిని ప్యాంటు కాదని స్వేచ్ఛకి తిరుగుబాటుకి చిహ్నంగా అక్కడివారు వీటిని పరిగణిస్తూ ఉంటారు. అందుకే ఉత్తర కొరియా దేశానికి సంస్కృతి అనుగుణంగా క్రమశిక్షణకు పెద్దపీట వేసేలా ఉంటారని చాలామంది చెబుతూ ఉంటారు.

జీన్స్ అనేది కేవలం ఫ్యాషన్ కాదు అంతకుమించి ముప్పు అన్నట్లుగా అక్కడివారు నమ్ముతూ ఉంటారు. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరూ కూడా జీన్స్ ధరించరు. తమ దేశానికి సాంప్రదాయమైన అనుగుణంగానే ఉండేలా చూస్తూ ఉంటారు. ఈ నియమాలను ఎవరైనా ఉల్లంఘించకుండా దుస్తుల కోడిని అమలు చేయడమే కాకుండా వీధుల్లో అందుకోసం పోలీసులను కూడా పెట్రోలింగ్ చేయిస్తూ ఉంటారట.. ఎవరైనా జీన్స్ ధరించి కనపడితే మాత్రం చాలా కఠినమైన పరిణామాలు ఉంటాయట బహిరంగంగా అవమానం, జైలు శిక్ష, జరిమానా ఇలా ఎన్నో అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అక్కడ అధ్యక్షుడు కిమ్ తన పాలన పైన పట్టు కోసం ఎన్నో ఆంక్షలు సైతం తెలియజేస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా అక్కడ ప్రజలు పాటిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: