వైరల్: టెక్నాలజీ వాడిన గుమ్మడికాయ దొంగ...?

FARMANULLA SHAIK
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అటువంటి బంగారాన్ని ఏదో విధంగా దేశంలోకి తీసుకురావడానికి స్మగ్లర్లు చేసే రకరకాల ప్రయోగాలు అంతా ఇంతా కాదు. పోలీసులను బురిడీ కొట్టించి వాటిని దేశంలోకి తెప్పించడం ఒక పెద్దటాస్క్.అయితే అలాంటి స్మగ్లర్ల టాలెంట్ చూసి పోలీసులు షాక్ అవుతా ఉంటారు. ఇలాంటి ఒక సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ప్రక్రియలో దొంగ చూపిన తెలివితేటలకు  ప్రజలు అవాక్కయ్యి అతనిది మామూలు బ్రెయిన్ అతనిది మామూలు బ్రెయిన్ కాదని 5జి బ్రెయిన్ అని కొనియాడారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలో ఒక వ్యక్తి తన బ్యాగులో ఉన్న గుమ్మడికాయలపై సదరు పోలీసులకి అనుమానం రావడంతో అతనిని స్టేషన్ కి తీసుకుపోయి బెటర్ డిక్టేటర్ సహాయంతో పరీక్ష చేశారు. ఒక గుమ్మడికాయల నుంచి శబ్దం రావడంతో అనుమానపడ్డ పోలీసులు రెండవ గుమ్మడికాయని కూడా పరీక్షించారు. అయితే రెండవ గుమ్మడికాయ నుంచి అలాంటి శబ్దం ఏమి రాలేదు. దాంతో షాక్ అయిన పోలీసులు గుమ్మడికాయలను కోసి చూడగా దాని నుండి బంగారపు బిస్కెట్లు బయటపడ్డాయి. దాంతో అక్కడి ప్రజలందరూ దొంగ చూపిన తెలివితేటలకు షాక్ అయ్యారు.ఈ ఘటన ఎక్కడ వెలుగు చేసిందీ తెలియదు కానీ నెట్టింట వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవడమే కాకుండా తన అభిప్రాయాలను నెట్టి్ంట పంచుకున్నారు. దొంగ తెలివితేటలు చూసి చాలా మంది షాకైపోయారు. ఇతడిది 5జీ బ్రెయిన్ అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం పోలీసుల నిఘాపై ప్రశంసలు కురిపించారు. దొంగలు ఎంత తెలివిగల వారైనా పోలీసుల కన్నుకప్పి తప్పించుకోలేరంటూ తెగ పొగిడేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: