షిరిడీ: వెంకన్నకు మించిన. . ఆదాయం.. ఏకంగా..?

Divya
కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుపొందిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాల్సిన పనిలేదు..ఎంతో మంది భక్తులు ప్రతిరోజు ఈయనను చూడడానికి వస్తూ ఉంటారు.. అలాగే వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం కూడా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు అటువంటి వెంకటేశ్వరుడి ఆదాయంతో శిరిడి సాయికి పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. గురు పౌర్ణమి సందర్భంగా జులై 20వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు సైతం మూడు రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా జరిగాయట.

ఒక్క రోజులోనే షిరిడి సాయిబాబా ఆదాయం రూ .6 కోట్లకు పైగా వచ్చిందని తెలుస్తోంది. భక్తుల నుంచి విరాళాలు వివిధ రూపాలలో ఈ ఆదాయం వచ్చినట్లుగా అక్కడ ఆలయ అధికారులు తెలియజేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి రెండు కోట్ల 50 లక్షలకు పైగా నగదు వచ్చిందని.. కోటి రూపాయలకు పైగా విరాళం వచ్చిందని.. ఇతర డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా రెండు కోట్ల రూపాయలు కొంతమంది భక్తులు పది లక్షలకు పైగా బంగారం వెండిని సరిత ఇచ్చారని.. అలాగే లడ్లు కవర్ల విక్రయం వల్ల 62 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందనీ తెలిపారు.

ఇక మూడు రోజులు కూడా శిరిడి పట్టణం ఒక్కసారిగా భక్తులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. 21వ రోజున జపాన్ కు చెందిన 18 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి బాబా ఆశీస్సులను సైతం తీసుకున్నారట. వీరు పది సంవత్సరాలుగా ప్రతి ఏటా కూడా ఇలా షిరిడి సాయిబాబా అని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారట. వీరు సుమారుగా 1,90,000 మందికి భోజనాలు ఏర్పాట్లు చేశారు. అలాగే సాయిబాబా జీవితం ఆధారంగా థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు షిరిడి పురపాలక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. దాదాపుగా 22 ఎకరాలలో ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: