వార్నీ.. స్కూటీ సెంటర్ స్టాండ్ వేయడం.. ఇంత ఈజీనా?

praveen
స్కూటీలను గతంలో మహిళలు కాస్త ఎక్కువగా వాడేవారు అన్న విషయం తెలిసిందే. అందుకే స్కూటీలు అంటే మహిళల బండ్లు అనే పేరు కూడా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఈ స్కూటీలను వాడేస్తూ ఉన్నారు. ఇక ఎన్నో కంపెనీలు ఎలక్ట్రికల్ వాహనాలను కూడా తీసుకురావడం కారణంగా సౌండ్ పొల్యూషన్ తో పాటు ఇక అటు ఎయిర్ పొల్యూషన్ కూడా ఉండదు. కాబట్టి చాలామంది స్కూటీ కొనుగోలు చేసి వాడటానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి.

 అయితే ఇలా స్కూటీ ఉపయోగిస్తున్న వారు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు సెంటర్ స్టాండ్ వెయ్యాలి అంటే తెగ ఇబ్బంది పడిపోయేవారు. ఎందుకంటే స్కూటీ చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి ఇక సెంటర్ స్టాండ్ వేయడానికి నానా తంటాలు పడేవారు. మరి ముఖ్యంగా మహిళలు అయితే సెంటర్ స్టాండ్ వేయడానికి ఇబ్బంది పడి చివరికి వేయకుండానే ఊరుకుండీ పోయేవారు. కొంతమంది ఇలా నిలువు స్టాండ్ వేసే క్రమంలో గాయాలు కూడా చేసుకునేవారు అన్న విషయం తెలిసిందే. ఇది అందరికీ జరిగిన అనుభవమే అయి ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే సెంటర్ స్టాండ్ వేయడం ఇంత ఈజీనా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది.

 ఇన్నాళ్లు నిలువు స్టాండ్ వేయడానికి ఎంతో కష్టపడి కొన్ని కొన్ని సార్లు గాయాలు కూడా చేసుకున్నాం అని ఎంతో మంది ఈ వీడియో చూసిన తర్వాత మనసులో తప్పకుండా అనుకుంటారు. అయితే సెంటర్ స్టాండ్ ని ఎలాంటి కష్టం లేకుండా ఎంతో సులభంగా ఎలా వేయొచ్చు అన్న విషయాన్ని ఇప్పుడు ఒక వ్యక్తి చేసి చూపించాడు. ముందుగా సైడ్ స్టాండ్ వేయాలి. ఆపై సైడ్ స్టాండ్ వేసిన వైపే స్కూటీని బాగా వంచితే సెంటర్ స్టాండ్ వేయడానికి కావలసిన స్పేస్ దొరుకుతుంది. ఆ వెంటనే సెంటర్ స్టాండ్ కూడా కిందికి దించితే సరిపోతుంది. ఇలా ఎలాంటి శ్రమ లేకుండా  కష్టపడకుండానే స్కూటీకి సెంటర్ స్టాండ్ వెయ్యొచ్చు. ఇక ఈ వీడియో చూసి ఇంటర్నెట్ జనాలు సర్ ప్రైస్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: