పాము, ముంగిస పోరాటం.. ఫైట్ చేస్తూ ఉయ్యాలలో ఉన్న చిన్నారిపై పడ్డాయి.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా ఘటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు అందరిని నవ్విస్తే మరికొన్ని వీడియోలు భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం ఇక ఏకంగా చూస్తున్న కళ్ళనే నమ్మలేనంత విధంగా మాయ చేసేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ఇలాంటి వింతైన వీడియోలకి కొదవలేదు.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు వెలుగులోకి వచ్చిన వైరల్ గా మారిపోయే వీడియోలలో.. పాము ముంగిసలకు సంబంధించిన వీడియో కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. పాము ముంగిస జాతి వైరాన్ని కలిగి ఉంటాయి. పుట్టుకతోనే శత్రుత్వం ఉంటుంది. దీంతో ఈ రెండు ఎదురపడ్డాయి అంటే ఏదో ఒక జీవి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఆ రేంజ్ లో భీకర రీతిలో ఈ రెండిటి మధ్య పోరు జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది.

 ఓ పొలం గట్టున పాము ముంగిస మధ్య ఫైట్ జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే ఆ రెండు పోట్లాడుకుంటూ పక్కనే ఉయ్యాలలో పడుకున్న ఒక చిన్నారి పైకి దూసుకువెల్తాయ్. ఈ క్రమంలోనే నాగుపాము ఆ చిన్నారిపై పడింది. అయితే అక్కడే ఉన్న మిగతా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. అయితే చిన్నారి ఊయల నుంచి ఇక పైకి పాకుతూ వెళ్లిన పాము ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇది చూసి నేటిజన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: