ఓరి నాయనో.. భక్తిలో మునిగిపోయి.. ఎగసిపడుతున్న మంటల్లో దూకుతున్న భక్తులు?

praveen
మనదేశంలో దేవుళ్లను కొలిచే విధానం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా ప్రాంతాల వాళ్ళు వారి పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఏకంగా దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది మాత్రం ఇక ఏకంగా ప్రాణాలకే ప్రమాదకరమైన ఆచారాలను కూడా ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి తరహా ఆచారాలకు సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు తెరమీదకి వస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి.

 సాధారణంగా భారతదేశంలో దేవుళ్లను కొలిచే విధానంలో తరచూ కనిపించేది నిప్పుల గుండాలలో నడవడం. ఇలా నిప్పుల గుండాలలో నడవడం వల్ల పాపాలు తొలగిపోతాయని అదృష్టం వరిస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా దేవుడు కోరిన కోరికలు తీర్చుతాడు అని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా నిప్పుల గుండంలో నడవడం లేదంటే మండే కర్పూరాన్ని మింగేయడం ఇలాంటివి చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అంతకుమించి అనే రేంజ్ లోనే ఒక భయానక ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తేనే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది.

 హోలీ పండుగకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే హోలీకి అన్ని చోట్ల సన్నహాలు మొదలయ్యాయి అని చెప్పాలి. ఇక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలలో అయితే హోలీ వేడుకలు మరింత ఘనంగా జరుపుకుంటారు. ఇక కేరళలోనూ హోలీ వేడుకలు ఇలా అంబరాన్ని అంటుతూ ఉంటాయని చెప్పాలి. అయితే అక్కడ ఓ ప్రాంతంలో ఒక విచిత్రమైన ఆచారాన్ని పాటిస్తూ ఉంటారట. ఏకంగా భగభగ మండుతున్న మంటల్లో నుంచి జనం దూకడం ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియోలో కనిపిస్తుంది. కేరళలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఇది జరుగుతూ ఉంటుందట. ఆలయ ప్రాంగణంలోని నిప్పులో  నడుస్తూ వేడుక జరుపుకుంటూ ఉంటారట  ద్రౌపది దేవత ఆశీర్వాద కోసం భక్తులు అగ్ని గుండాన్ని దాటడం.. ఇక ఎన్నో రోజుల నుంచి వస్తున్న ఆచారమని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇక ఈ వీడియో చూసి మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: