వైరల్: ఎన్నికలవేళ సామాన్యులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ ధరలు తగ్గింపు..!!

Divya
సార్వత్రిక ఎన్నికల వేల వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను వెల్లడించింది.. పెట్రోల్ డీజిల్ ధరలను సైతం రూ .2 రూపాయలు తగ్గించినట్లుగా కేంద్రం శాఖ మంత్రి ఇటీవలే ప్రకటించారు.. ఇలా డీజిల్ పెట్రోల్ పైన రూ .2..రూపాయల తగ్గించడంతో ప్రధాని మోడీ కోట్లాదిమంది భారతీయుల సంక్షేమం కోసమే పాటుపడుతున్నారు అంటూ వెల్లడించారు.. అయితే ఈ తగ్గిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అన్ని ప్రాంతాలలో కూడా అమలులోకి వస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.. ప్రస్తుతం రాజధాని అయినటువంటి ఢిల్లీలో.. పెట్రోల్ ధర రూ.96.72 పైసలు ఉండగా రూ.94.72 రూపాయలకు తగ్గిపోతుంది.
అయితే ప్రస్తుతం ఉన్న నగరాలలో బట్టి ధరలలో వ్యత్యాసం ఉంటుందట. రూ .2రూపాయలు చొప్పున తగ్గుతుందట. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నది. ఇందులో భాగంగా ఆయా వర్గాలకు కేంద్రం పలు రకాల వాటిని ప్రకటిస్తూనే ఉంది. మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ పైన 100 రూపాయల మేరకు తగ్గించింది. ఆ తర్వాతే పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలియజేసింది.

ఇప్పుడు తాజాగా వాహనదారులను దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ డీజిల్ పైన తగ్గించామని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.. గత కొద్దిరోజులుగా లీటర్ పెట్రోల్ రూ.110 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నప్పటికీ చాలా రోజుల నుంచి ధరలు తగ్గడం లేదు.. ఎన్నికలవేళ వాహనదారులకు మాత్రం రూ .2రూపాయలు తగ్గించి కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిస్తోంది. మరొకవైపు ప్రధాన మోడీ దేశవ్యాప్తంగా ఉండే ఆయా రాష్ట్రాలలో పర్యటనలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తూ కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు.. అలాగే రాబోయే ఎన్నికలలోని పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను కూడా బిజెపి ప్రభుత్వం ప్రకటిస్తోంది. మొదటి జాబితా 195 మంది రెండవ జాబితా 72 మంది వెల్లడించారు. మూడో జాబితా పై కూడా కసరత్తులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: