తెలివి తక్కువ పని కాకపోతే ఇంకేంటి.. ఆకలితో ఉన్న హైనా బోన్ లోకి వెళ్ళాడు?

praveen
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువులలో హైనాలు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక వీటి వేట ఏకంగా సింహం, పులుల కంటే అత్యంత క్రూరంగా ఉంటుంది అని చెప్పాలి. అడవికి రారాజు అయిన సింహం సైతం హైనాల జోలికి వెళ్ళాలి అంటే కాస్త ముందు వెనుక ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉండే హైనాలు ఏకంగా సింహాన్ని సైతం వేటాడటానికి కూడా వెనకడుగు వెయ్యవు. ఇక ఎంతో చాకచక్యంగా వేటను ముగించుకొని ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఏదైనా జంతువు హైనాల నోటికి చిక్కింది అంటే దానికి కాలం చెల్లిపోయినట్టే. అలాంటిది ఏకంగా హైనాలు మనుషుల మీద దాడి చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇక హైనాలు ఉన్న బోన్ దగ్గరికి వెళ్లడానికి కూడా మనుషులు భయపడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం తెలివి తక్కువ పనిచేశాడు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఆకలితో ఉన్న హైనా బోనులోకి వెళ్ళాడు. చివరికి హైనా అతనిపై దాడి చేసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఓ వ్యక్తి ఏకంగా అత్యంత ప్రమాదకరమైన హైనాను పెంచుకోవడమే కాకుండా.. సరదాగా గడపడానికి హైనా ఉన్న బోన్ లోనే అడుగు పెట్టాడు. ఆ హైనా అతనికి పూర్తిగా అలవాటు కాకుండానే ఏకంగా దానితో ఆటలు ఆడుకోవాలి అనుకున్నాడు. అయితే ఇక అతను బోన్ లోకి రాగానే ఈరోజు మంచి ఆహారం దొరికింది అనుకున్న హైనా అతనిపై దాడి చేసింది. ఏకంగా అతని కాలిపిక్కను నోట కరిచింది. అతడు విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే ఈ వీడియో చూసిన నేటిజన్స్  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలివి తక్కువ పని కాకపోతే ఇలా హైనా జోలికి వెళ్లడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: