సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయడం వెనుక ఇంత మర్మం ఉందా..!!

Divya
రైతే రాజు అనే నానుడి వింటూ ఉంటాము కదా. అలాంటి రైతుకు కూడా సెలవునిచ్చే పండుగే సంక్రాతి.పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి, పండించిన పంట ఇంటికొచ్చే సమయంలోనే సంక్రాంతి పండుగ వచ్చి,సంతోషాలను తెస్తుంది.అలా పండించిన కొత్త ధాన్యంతో పొంగళ్లు పెట్టి,దేవుడికి మొదటగా నైవేద్యం సమర్పిస్తారు.మరియు జనం శ్రేయస్సుకు ప్రతిరూపంగా ఈ పండుగను సంబరాలు మిన్ను అంటేలా జరుపుకుంటారు.
సాధారణంగా సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి వచ్చేదానినే మకర సంక్రమణం అంటారు.ఆ సమయంలోనే మకర సంక్రాంతి జరుపుకుంటారు.ఈ పండుగను దక్షిణ భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు.పశువులను స్నానాలు చేయించి,అందంగా అలంకరించి,దైవంగా భావించి పూజిస్తారు.ఎందుకంటే వ్యవసాయం వాటి మీదే ఆధారపడి ఉంటుంది కదా.అలాంటి తల్లిలాంటి పశువులను పూజించడం ఇక్కడి అనవాయతీ.ఇంటి తలుపులను వడ్లమాలలు వేసి,చెరకుగడలు, అరటి చెట్లతో అలంకరించి,లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.
సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు, పిండి వంటలు,కోడిపందేలు,ఎడ్లపందాలు కూడా గుర్తొస్తాయి. మరియు కొన్ని ప్రాంతాల్లో పరుగు పందాలు,ముగ్గుల పోటీలు,రెజ్లింగ్ లు వంటి ఆటలతో పాటు గాలిపటాలను ఎగురవేసే ఆచారాలూ కూడా పాటిస్తారు. కానీ ఇలా గాలిపటాలను ఎగురవేయడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయని చెబుతుంటారు పెద్దలు.మరి అవేంటో తెలుసుకుందాం పదండీ..
పల్లెటూరులో రంగుల ముగ్గులు వేసుకుంటూ, రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగురవేస్తూ ఉంటే ఆ సంబరమే వేరుగా ఉంటుంది.ఆ సమయంలో గాలిపటాలు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.మరి ముఖ్యంగా పిల్లలు బోరింగ్ గా పీల్ అవుతారు కూడా. కానీ ఈ గాలిపటల వెనుక సైన్స్ కూడా ఉంది.సాధారణంగా వింటర్ లో బ్యాక్టిరియా, వైరస్ లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.వీటివల్ల జబ్బులు, జ్వరం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో సూర్యకిరణాలను పొందడం ద్వారా బ్యాక్టీరియా నశిస్తుంది.కావున గాలిపటాలను ఎగురవేసేటప్పుడు పిల్లలు,పెద్దలు ఎండలో ఉంటారు ఆ సమయంలో సూర్యకిరణాలు నేరుగా మన శరీరంపై పడి,రోగాలను దరి చేరకుండా ఉంటాయి.సంక్రాంతికి గాలిపటాలను ఎగురవేయడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం ఇదే.
అంతేకాక ఉత్తరాయణ సమయంలో గాలిపటాలు ఎగురవేస్తే,స్వర్గానికి వెళ్తారని పురాణాలూ కూడా చెబుతున్నాయి.మరియు మంచి జీవితాన్ని, సంతోషాన్నిచ్చినందుకు, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతీకగా గాలిపటాలను ఎగురవేస్తారట.కావున మీరు కూడా గాలి పటాలు ఎగురవేయడం మర్చిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: