6,511 పోలీసు ఉద్యోగాలపై..1000 ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులపై డిజిపి కీలక ప్రకటన..!!
ఇటీవలే కోర్టులో ఎత్తు నిర్వహణ వ్యవహారంలో కొంతమంది నిరుద్యోగులు కేసు వేయక కొద్ది రోజులు ఆగిపోవడం జరిగింది.. కోర్టు తీర్పు అనంతరం ఇటీవల ఎస్ఐ ఫలితాలను విడుదల చేసుకోవచ్చని తెలియజేసింది.. త్వరలోనే ఎస్సై ఫలితాలను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు డిజిపి.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పూర్తి కాగా, ఈవెంట్స్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. మరి వీటికి సంబంధించి మెయిన్ ఎక్సమ్ ఈవెంట్స్ వంటివి ఎప్పుడు నిర్వహిస్తారు ఇంకా తెలియాల్సి ఉన్నది..
అయితే అటు అటవీశాఖ ఒక కీలక మైన ప్రకటనను జారీ చేసింది. అటవీ శాఖలో ఉద్యోగాల ఖాళీల భర్తీ కి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని pccf మధుసూదనా రెడ్డి తెలిపారు మొత్తం మీద ఇందులో 1000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు.. 50,రేంజర్లు 200సెక్షన్ ఆఫీసర్లు,750 బీటు అధికారుల పోస్టుల భర్తీల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలియజేయడం జరిగింది.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 100చోట్ల నగర భవనాలను సైతం నిర్మిస్తున్నామని, ఇందుకోసం దాదాపుగా రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలియజేశారు.
అయితే రానున్న ఎలక్షన్స్ తరుణంలో ఈ పోస్టులన్నీ కూడా ఫిలాప్స్ చేయాలని ఏపీ ప్రభుత్వం పలు రకాల సలహాలు చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ కి సైతం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతోంది ఏపీ ప్రభుత్వం.