అయ్యప్ప మాల వేసుకున్న అమ్మాయిపై.. స్కూల్ యాజమాన్యం ఓవరాక్షన్..!!

Divya
చాలామంది ప్రజలు తమ పిల్లలకు కూడా అయ్యప్ప మాలని వేయిస్తూ ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ రాకుండా ఉంటాయని ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది అయ్యప్ప మాల వేసుకున్న చిన్నారిపట్ల స్కూలు యాజమాన్యాలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఒక ప్రైవేటు స్కూలు యాజమాన్యం కఠినంగా వ్యవహరించిందట.. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉండే బండ్లగూడలో జరిగింది. మాల వేసుకున్న చిన్నారికి స్కూల్ డ్రెస్ లేదని లోపలికి అనుమతించ బోమంటు వార్నింగ్ ఇచ్చారు.

 అంతే కాకుండా స్కూల్ ఆవరణంలో గంటపాటు ఎండలోనే నిల్చో పెట్టడం జరిగిందట. మాల వేసుకుంటే స్కూల్లోకి అనుమతించేది లేదని బయట నిలబెట్టడం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి స్కూల్ వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది.తమ కూతుర్ని స్కూల్లోకి ఎందుకు అనుమతించలేదో చెప్పాలని ఆ చిన్నారి తల్లిదండ్రులు  యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడంతో తన మొబైల్ ఫోన్లో ఒక వీడియోని సైతం రికార్డు  చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ ఇవన్నీ చెల్లవంటూ ఆ చిన్నారి తండ్రిని ఆ స్కూల్ యాజమాన్యం బెదిరించడం జరిగిందట.

దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రుల సైతం ఆందోళన చేసినప్పటికీ యాజమాన్యం తమ స్కూలు రూల్స్ ఇలానే ఉంటాయంటే తెలియజేయడంతో ఆ తల్లితండ్రులు చేసేదేమీ లేక టీ షర్ట్ తీసుకొచ్చి ఆ చిన్నారికి వేసి స్కూల్లో కూర్చోబెట్టడం జరిగింది.. ఆ చిన్నారి జరిగిన సంఘటన పైన పలువురు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మాల ధరించిన చిన్నారులను స్కూల్ లోపలికి రానివ్వకపోవడం ఏమిటి అంటు..తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చాలామంది హిందువుల సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి వైఖరిని స్కూల్ యాజమాన్యాలు విడనాడాలని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా చిన్న పిల్లల సైతం అయ్యప్ప మాల ధరించవచ్చని.. ఇలాంటి దుస్తులు వేసుకొని స్కూలుకి రాకూడదని రూల్ ఏమీ లేదంటూ పలువురు నేతలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: