సోషల్ మీడియాకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది.అందులో ఫేమస్ అయ్యామంటే ఖచ్చితంగా సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది.ఒక్కసారి క్రేజ్ వచ్చిందంటే చాలు ఇక వారికి తిరుగుండదు. ఇక ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినోళ్లు చాలామందే ఉన్నారు. అందుకే ఇప్పుడు యూత్ సోషల్ మీడియాకు అంతగా అడిక్ట్ అయిపోయింది. ఈమధ్య కాలంలో రీల్స్, షార్ట్ వీడియోలపై బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.అయితే.. యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లలో అత్యధిక వ్యూస్ కోసం కొందరు ఎన్నో పిచ్చి పనులు చేస్తున్నారు. కొంతమంది మంచి కంటెంట్‌ను నమ్ముకుంటుంటే మరికొందరు మాత్రం ప్రమాదకరమైన ఫీట్స్‌ను నమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఇంకొందరు అయితే ఏకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తోటి వారి ప్రాణాలను పెద్ద రిస్క్ లో పడేస్తున్నారు.
తాజాగా ఓ యూట్యూబర్ చేసిన పని అందరినీ పెద్ద షాక్ కి గురి చేసింది. ప్రజల ప్రాణాలతో వాడు చెలగాటం ఆడిన వైనం కోపం తెప్పిస్తోంది.అసలు వాడు ఏం చేశాడో తెలుసా.. రైల్వే ట్రాక్ పై బాణసంచా కాల్చాడు. రైల్వే ట్రాక్ మధ్యలో బ్లాక్ స్నేక్ పటాసులని ఉంచాడు. ఆ తర్వాత దానికి వాడు నిప్పు పెట్టాడు. ఇక అందులో ఉంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అప్పుడు భారీగా పొగ అలుముకుంది. వాడు దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు.రాజస్తాన్ రాష్ట్రంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పులేరా అజ్మీర్ సెక్షన్ దంత్రా స్టేషన్ దగ్గర వాడు ఈ పని చేశాడు. ఈ వీడియో 33 సెకన్ల నిడివితో ఉంది.
రైల్వే ట్రాక్ పై పటాసులు ఉంచి కాల్చడమే కాకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు ఆ పోరంబోకు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. ఆ యూట్యూబర్ తీరుపై నెటిజన్స్ అంతా మండిపడుతున్నారు. ఇలాంటోళ్లను ఏం చేసినా ఎలా శిక్షించినా పాపం లేదంటున్నారు. వ్యూస్ కోసం లైక్స్ కోసం పాపులారిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇలాంటి పోరంబోకులని చాలా కఠినంగా శిక్షించాలని అడ్డంగా నరికేయాలని వీడికి ఎలాగైనా మరణశిక్ష పడాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. రైలులో కొన్ని వందల సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.వీడిని శిక్షించకుంటే మనకు తీవ్రవాదులకు తేడా ఉండదని నెటిజన్స్ మండిపడుతున్నారు.
ఈ వీడియో ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యింది. అది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఇక వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. వాడిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.ఇప్పుడు పోలీసులు ఆ యూట్యూబర్ ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. అతడిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.