షాక్ ఇచ్చిన కోబ్రా.. ఎక్కడ దాక్కుందో చూడండి?
అయితే కళ్ళ ముందు కనిపించేది విషపూరితమైన తాము అని తెలిసింది అంటే చాలు కొంతమందికి భయంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. అయితే వర్షాకాలంలో ఎక్కడబడితే అక్కడ పాములు ప్రత్యక్షమవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే అందుకే ప్రతి చోట ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ సూచిస్తూ ఉంటారు నిపుణులు. ముఖ్యంగా ఇంటి బయట పార్క్ చేసి ఉన్న వాహనాలలో లేదా ఇంటి బయట వదిలిన షూస్ లేదా చెప్పులలో కూడా పాములు అప్పుడప్పుడు నక్కి ఉంటాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.
ఒక వ్యక్తి రోజు లాగానే ఎంతో హడావిడిగా బయటికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఇక ఇంటి బయట వదిలిన చెప్పులు వేసుకోవడానికి రెడీ అయ్యాడు. కానీ ఎందుకో అతనికి అనుమానం వచ్చింది దీంతో ఇక అతను చెప్పు లోపల చెక్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే అందులో ఏకంగా నాగుపాము కనిపించింది. అతని చూడగానే నాగుపాము పడగ విప్పి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. దీంతో అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. ముంబైలోని గృహాన్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. పాము ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.