శుక్రవారం రోజున చంద్రబాబును అరెస్టు చేయడానికి కారణం..?

Divya
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఇటీవలే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబునాయుడు కు సంబంధించి ఆధారాలు ఉండడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సిఐడి ప్రకటించడం జరిగింది.. శుక్రవారం రోజు రాత్రి నంద్యాలలో చంద్రబాబు బస చేస్తున్న..RK ఫంక్షన్ హాలు వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడి అరెస్టు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే శనివారం ఉదయం ఆయనను విజయవాడకు తరలించడానికి CID భద్రతతో విజయవాడకు తరలిస్తామని తెలియజేశారు.

చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన విషయం టిడిపి కార్యకర్తలు నేతలు తెలుసుకొని భారీగా చేరుకోవడం జరిగింది.. చంద్రబాబు నాయుడు అరెస్టు పైన స్పందిస్తూ తాను ఏ తప్పు చేయలేదని ప్రజా సమస్యల పైన పోరాడుతుంటే అణిచివేయడానికి ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.. తనను అరెస్టు చేయడానికి అసలైన ఆధారాలు ఏవని కూడా అడిగారు ఎవరిని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా రాజకీయ ప్రత్యర్థులను సైతం శుక్రవారం రోజున అరెస్టు చేయడం జరుగుతుంది ఎందుకంటే వారికి సోమవారం వరకు బెయిల్ రాదు కాబట్టి ఇలా చేస్తోంది అని వార్తలను టిడిపి నేతలు తెలియజేస్తూ ఉన్నారు.

ఇక పోతే చంద్రబాబు నాయుడుకు సిఐడి అధికారులు సిఆర్పి -50(1) కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిగా విజయవాడకు బయలుదేరి రావడం జరిగింది అయితే లోపలికి అనుమతించబోమని అధికారుల సైతం అడ్డుక్కోవడంతో రోడ్డు బయట నిరాహార దీక్షతో పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం లోకేష్ ను తన కుటుంబ సభ్యులను మాత్రమే లోపలికి అనుమతించే అవకాశం ఉన్నదంటూ తెలియజేసినట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ విషయం మరి ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: