ఏపీ సీఎంకు గుడ్ న్యూస్ తెలిపిన సిబిఐ కోర్టు..!!
ఇప్పుడు తాజాగా హైకోర్టు మాత్రం జగన్ దంపతులకు గుడ్ న్యూస్ తెలియజేసింది.. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆయన భార్య భారతి రెడ్డితో కలిసి వైఎస్ జగన్ లండన్ పర్యటనకు సిబిఐ హైకోర్టు సైతం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం విన్న పలు ప్రతిపక్ష పార్టీలు సైతం అయోమయంలో పడ్డారు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయవాడ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడి నుంచి షెడ్యూల్ విమానంలో లండన్ వెళ్లేందుకు సైతం జగన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.. లండన్ లో తన కుమార్తెల వద్దకు వెళ్లాలని జగన్ దంపతులు సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
లండన్ లో చదువుతున్న కుమార్తె వద్దకు జగన్ దంపతులు ప్రతి ఏటా కూడా వెళుతూ ఉంటారు.. గత ఏడాది ఆమె డిగ్రీ పట్టా పొందిన సందర్భంలో జగన్ దంపతులు అక్కడికి వెళ్లి తమ కూతురిని సైతం అభినందించడం జరిగింది. అంతేకాకుండా 2021లో తమ కుమార్తెల సమక్షంలోనే జగన్ దంపతులు సైతం తమ వివాహ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. అయితే గత ఏడాది వీరు లండన్ కి వెళ్ళినప్పుడు కూడా పలు వివాదాలను తెరలేపారు ప్రతిపక్షాలు. ఇప్పుడు వీరందరికీ షాక్ ఇచ్చే విధంగా సిబిఐ అనుమతి ఇవ్వడంతో ప్రతిపక్షాలు సైతం నోరు మూయించేలా చేశారు..