సెప్టెంబర్ నెలలో స్కూళ్లకు కాలేజీలకు ఎన్ని రోజులు సెలవులంటే..?
వరదలు వర్షాలు ఇతరత్రా సమస్యల వల్ల ఏదైనా కూడా ఈ ఏడాది స్కూళ్లకు కాలేజీలకు భారీగానే సెలవులు వచ్చేస్తున్నాయి.. జూలైలో అకాల వర్షాల కారణంగా కూడా దాదాపుగా పది రోజులపాటు కొన్ని ఏరియాలలో స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు వచ్చే నెల దాదాపుగా వరుసగా పండుగలు ఉండడంతో విద్యార్థులకు భారీగా సెలవులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫీసులకు కూడా పలు రకాల సెలవులు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హాలిడేస్ ప్రైవేటు కంపెనీల మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు..మరి సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెలలో పబ్లిక్ హాలిడేస్ రెండవ శనివారం నాలుగవ ఆదివారాలతో పాటు వినాయక చవితి, మిలాద్- ఉన్- నభి, శ్రీ కృష్ణాష్టమి పండుగలకు సెలవులు ఉన్నాయి.. మరొకవైపు G-20 సదస్సు నేపథ్యంలో ఇప్పటికి ఢిల్లీ ప్రభుత్వం వచ్చేనెల 8, 9, 10 వ తేదీలలో స్కూళ్లకు కాలేజీలకు సైతం సెలవులు ప్రకటించడం జరిగింది.అలాగే ఈ సెలవులు ప్రైవేటు కార్యక్రమాలకు కూడా వర్తిస్తాయని క్రేజీ వాల్ తెలియజేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో స్కూళ్లకు కాలేజీలకు పబ్లిక్ హాలిడేస్ ఆయన ఆదివారాలు శనివారాలతో పాటు పండుగలతో స్కూళ్లకు కాలేజీలకు ప్రైవేటు కార్యక్రమాలకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరి ఈ మేరకు వచ్చే నెలలో ఎన్ని రోజులు సెలవులు ఇస్తారనే విషయంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఎండలు కూడా చాలా తీవ్రమవుతున్న నేపథ్యంలో సెలవులు కూడా కాస్త ఎక్కువగానే వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా విద్యార్థుల సైతం వినాయక చవితిని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఇప్పటికే పలు రకాల సన్నహాలు కూడా చేసుకుంటూ ఉంటున్నారు. ఇక హాలిడేస్ వివరాలు తెలిసి మరింత ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటారేమో చూడాలి మరి.