షాకింగ్ : క్రీడాకారుడుని మొసలి ఎలా లాక్కెళ్ళిందో చూడండి?

praveen
ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి   వస్తూ ఉంటాయి. ఇలా వెలుగులోకి వచ్చిన ఘటనల్లో కొన్ని నవ్వుతెప్పిస్తూ ఉంటే ఇంకొన్ని మాత్రం భయాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పాలి. వైల్డ్ లైఫ్ లో ప్రమాదకరమైన జీవులు అటు ఏకంగా మనుషులపై దాడి చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్ లోకి వస్తూ అందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.  ఇది చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏకంగా ఒక క్రీడాకారుడు ఒక భారీ మొసలి కి బలయ్యాడు.

 ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. కోస్టారికా దేశంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఆ దేశంలో ఫుట్బాల్ క్రీడాకారుడుగా కొనసాగుతున్న జీసస్ ఆల్బర్ట్ లోఫేస్ ఒక భారీ మోసలికి బలయ్యాడు. ఈ క్రమంలోనే అతని అవశేషాలను అధికారులు అతి కష్టం మీద వెలిక్కి తీసారు అని చెప్పాలి. అయితే ఈ క్రీడాకారుడుని చంపి తిన్న మొసలిని చంపడానికి ఇక అధికారులు చివరికి తుపాకులు వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఇంతకీ ఏం జరిగిందంటే కోస్టారికా రాజధాని షాన్ జోస్కో 140 మైళ్ళ దూరంలో శాంటా క్లాజ్ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది.  మూసివేసి ఉన్న ఒక ఫిషింగ్ బ్రిడ్జిపై నుంచి కనాస్ నదిలో దూకాడు. అయితే ఒక పెద్ద మొసలి అతడిని నోట కరుచుకొని లాకెళ్లింది. స్థానికులు పెద్ద శబ్దాలు చేస్తున్న మొసలి మాత్రం భయపడలేదు. అయితే ఈ ఘటన చూపరులను ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసింది. అయితే వ్యాయామం చేస్తున్న సమయంలో ఆల్బర్ట్ నదిలో దూకాడు. అయితే ఆ నదిలో మొసళ్లు ఉన్నాయి తెలిసి కూడా కూడా అతను దూకడం వెనక కారణమేంటన్నది తెలియ రాలేదు. 29 ఏళ్ల ఆల్బర్ట్ ఆర్టిస్ డిపార్టీగో రియో అనే ఫుట్బాల్ క్లబ్ కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: