వైద్యరంగంలో మహా అద్భుతం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా తాము చేస్తున్న కృషికి తగ్గ ఫలితం సాధించారు ఇజ్రాయెల్ వైద్యులు. మెడికల్ మిరాకిల్ చేసి చూపించారు. ఓ కార్ యాక్సిడెంట్‌లో తల తెగి తీవ్రంగా గాయపడి మరణం అంచుల దాకా వెళ్లిన ఓ 12 ఏళ్ల బాలుడి తలను తిరిగి అటాచ్ చేశారు. జూన్ నెలలో జరిగిన ఈ ఆపరేషన్ గురించి ఇటీవల ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇందుకు సంబంధించి సంచలన కథనం చేసింది.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.సులేమన్ హసన్ అనే బాలుడు సైకిల్ పై వెళ్తుండగా ఓ కారు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ ఘటనలో మొండెంతో అతని తల కూడా తెగిపోయింది.అంటే ఆ బాలుడి పుర్రె దేహంతో ముఖ్యంగా వెన్నెముకతో విడిపోయింది. దీన్ని వైద్యపరిభాషలో బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్‌లొకేషన్ అని అంటారు.
ఆ కారు ప్రమాదం తర్వాత బాలుడిని హదస్సా మెడికల్ సెంటర్‌కు అతన్ని వెంటనే ఫ్లైట్‌లో తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు అతనికి ఎమర్జెన్సీ సర్జరీ చేశారు.ఇక వైద్యులు తెలుపుతున్న వివరాల ప్రకారం, దాదాపు అతని తల మెడ బేస్ నుంచి దాదాపుగా వేరైపోయింది. అర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఒహద్ ఎయినవ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సర్జరీ కొన్ని గంటలపాటు సాగిందని ఆయన వివరించారు. కొన్ని కొత్త ప్లేట్లు, ఫిక్సేషన్లను డ్యామేజ్ జరిగిన చోట చేర్చాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ చేసే సామర్థ్యం తమకు ఉండటం ఇంకా అలాగే.. ఆపరేషన్ రూమ్‌లో అత్యాధునిక పరికరాలు అలాగే సౌకర్యాలు ఉండటంతో ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఆ బాలుడు బతికే చాన్స్ కేవలం 50 శాతమే ఉండేదని, ఇప్పుడు ఆ బాలుడు సజీవంగా తిరిగి రావడమంటే నిజంగా ఇది మిరాకిల్ అనే చెప్పాలని ఆయన వివరించారు.