నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో ఉద్యోగాలు..!!

Divya
నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అలాంటివారి కోసం.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ ఖాళీగా ఉన్న 7,784 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.. అర్హత కలిగిన వారు ఎవరైనా సరే అధికారిక వెబ్ సైట్ - indianrailways. gov. in లో రైల్వే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగలరు.
1).  పోస్ట్ నేమ్: ట్రావెలింగ్ టికెట్ ఎక్సామినార్.
2).  మొత్తం ఖాళీలు:7,784
3).  TTE రిక్రూట్మెంట్ 2023 : అర్హత
 
ఈ పోస్టులు గ్రూప్ సి పోస్టులు... కాబట్టి దరఖాస్తుదారులు 10వ తరగతి (SSLC / SSC/inter ) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా డిప్లమా కలిగి ఉండాలి.

4).TTE రిక్రూట్మెంట్.. జీతభత్యాలు.
 రైల్వే TTE స్థానానికి ఎంపికైన అభ్యర్థులకు గ్రాస్ పే   రూ.1,900 తో పాటు రూ.5,200 నుంచి రూ.20,200 వరకు ఉంటుందట.
5).ఎంపిక ప్రక్రియ.
దరఖాస్తుదారులు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఆ తరువాత షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు మెడికల్ ఫిట్నెస్  టెస్ట్ టెస్ట్ జరుగుతుంది.. మూడు రౌండ్లు క్లియర్ అయిన వారికే ఉద్యోగం లభిస్తుంది.TTE  రిక్రూట్మెంట్ 2023 కోసం  CBT 200 మార్కులకు ఉంటుంది. మరియు ఒక్కొక్కటి 40 మార్కుల 5 విభాగాలను కలిగి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం అధికారికంగా వెబ్సైట్లో సంప్రదించడం మంచిది.
6). దరఖాస్తు రుసుము.
 UR కేటగిరి లేదా జనరల్ కేటగిరీ కింద ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ 500 చెల్లించాలి. SC, st మాజీ సైనికులు/ వికలాంగులు/ మహిళలు/ మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (EWS )దరఖాస్తు రుసుము రూ .250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
7).TTE రిక్రూట్మెంట్ వయస్సు:
 దరఖాస్తు చేసుకునేవారు. జనవరి 1, 2023 నాటికి 18 మరియు 30 సంవత్సరాల మధ్య ఉండాలి. మరి అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: