స్టార్ డైరెక్టర్ పై లైంగిక వేధింపుల కేసు..!

Divya
మలయాళ సినీ ఇండస్ట్రీలో సినిమాలు తక్కువ బడ్జెట్ తోనే నిర్మిస్తూ, అన్ని భాషలలో డబ్బింగ్ చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. అలా ఇప్పటికే ఎన్నో చిత్రాలు విడుదలైనప్పటికీ 2024 లో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ చిదంబరం పొడువల్ కు ఇది రెండవ సినిమా. మలయాళం లోనే కాకుండా ఇతర సినీ పరిశ్రమలో కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఓటీటిలో కూడా బాగానే ఆకట్టుకుంది.


అయితే తాజాగా డైరెక్టర్ చిదంబరం పొడువల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. కేరళలోని ఎర్నాకులం టౌన్ సౌత్ పోలీసుల ఆయన పైన ఈ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఓ మలయాళ నటి ఫిర్యాదు ఆధారంగానే ఈ డైరెక్టర్ పైన కేసు నమోదు చేసినట్లు పోలీసుల సైతం తెలియజేస్తున్నారు. ఆ నటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే 2022లో కొచ్చి నగరంలో ఒక అపార్ట్మెంట్లో మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ తనతో లైంగికంగా, అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపణలు చేసింది.


ఈ విషయాలను బయట పెడితే తనని చంపేస్తాను అంటూ బెదిరించారని అందుకే ఈ విషయాలు తాను బయటికి చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు ధైర్యంగా వచ్చి మరి ఫిర్యాదు చేసినట్లుగా  తెలియజేసింది. ఆ నటి ఫిర్యాదు మేరకు మార్చి రెండవ తేదీన మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ బిఎన్ఎస్ సెక్షన్ 74,75 లైంగిక వేధింపుల నేరాల కింద కేసు నమోదు చేసి పోలీసులు సైతం విచారిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన డైరెక్టర్ ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారు చూడాలి మరి. మలయాళ సిరి ఇండస్ట్రీలో సంచలనం రేపిన ఈ కేసు ఆ బాధితురాలు పేరును మాత్రం చాలా గోప్యంగానే ఉంచినట్లు కనిపిస్తోంది. గత ఏడాది మీటూ ఉద్యమం తర్వాతే ఈ ఆరోపణలు రావడం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: