డబ్బులిచ్చి.. చావు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో?

praveen
తొందరగా గమ్య  స్థానాలకు చేరుకోవాలి అనే హడావిడిలో కొంతమంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రమాదం అని తెలిసినప్పటికీ కూడా కొన్ని సార్లు జనాలు చేసే పనులు ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఆర్టిసి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బస్సులో స్థలం లేకపోయినప్పటికీ కేవలం ఒకే కాలు బస్సు లోపల పెట్టి ఇక ఫుట్ బోర్డింగ్  చేస్తూ వేలాడటం లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు.



 అయితే అప్పుడప్పుడు అటు రైలు ప్రయాణాలు చేసే ప్రయాణికులు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి భయం కలగక మానదు. ఏకంగా మహిళలు రైల్లో ప్రమాదకరంగా ప్రయాణించడం ఈ వీడియోలో చూడవచ్చు. ముంబైలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ముంబైలో లోకల్ ట్రైన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో మాత్రం ఇక ప్రయాణికుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.


ఏకంగా ఆర్టీసీ బస్సులో ఫుట్ బోర్టింగ్ చేసినట్లుగానే వేగంగా పట్టాలపై దూసుకుపోతున్న లోకల్ ట్రైన్ లో కొందరు మహిళలు డోర్ దగ్గర  వేలాడుతూ కనిపించారు. ఏకంగా ఐదుగురు మహిళలు చేతులు సహాయంతో డోర్ వద్ద వేలాడటం ఈ వీడియోలో చూడవచ్చు. ఏ మాత్రం పొరపాటు జరిగిపోయిన కూడా ఏకంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పాలి. అయితే అక్కడే ఫ్లాట్ ఫారం మీద ఉన్న ఒక ప్రయాణికుడు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక దీనిపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరి చావును కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: