లక్ అంటే ఇదే.. ఓ వ్యక్తిని కోటీశ్వరుని చేసిన చికెన్ కబాబ్?

Purushottham Vinay
ఈ ప్రపంచంలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకోని అదృష్టం వరించి ఉన్నపళంగా కొందరు పెద్ద కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇంకొందరు అయితే ఉన్నదంతా పోగొట్టుకుని బికారీగా కూడా మిగిలిపోతుంటారు.రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిన సంఘటనలు మనం సోషల్ మీడియా ద్వారా చాలానే చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన కూడా. ఒక బస్సు డ్రైవర్ చికెన్ కబాబ్స్ కొనడానికి వెళ్లి ఏకంగా పది కోట్లకు అధిపతి అయ్యాడు. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది..? అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవచ్చు. కానీ ఈ సంఘటన నిజం. ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ లక్కీ ఘటన యూకేలోని లీసెస్టర్ నగరంలో చోటుచేసుకుంది.మిర్రర్ యుకె కథనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే 51 ఏళ్ల బస్సు డ్రైవర్ ప్రయాణ సమయంలో కబాబ్ షాపు వద్ద బస్సును ఆపి చికెన్ కబాబ్‌ను ఆర్డర్ చేశాడు.


ఇక చికెన్ కబాబ్ కు సమయం పడుతుందని చెప్పటంతో.. టైం పాస్ కోసం దగ్గరలోని లాటరీ షాపులో టికెట్ కొన్నాడు. దీంతో అతనికి ఏకంగా రూ.10 కోట్ల 25 లక్షల విలువైన బంపర్ లాటరీ తగిలింది.ఇక ఈ అదృష్ట వ్యక్తి పేరు స్టీవ్ గుడ్విన్.ఇక స్టీవ్ తన లాటరీ నంబర్ 73 అని చెప్పాడు. ఇంత పెద్ద మొత్తంలో గెలుస్తానని అస్సలు అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కానీ ఆ లాటరీ ఆఫీస్ టీం తనకు కాల్‌ చేసినప్పుడు షాక్‌కు గురయ్యానంటూ చెప్పుకొచ్చాడు. స్టీవ్‌ ముందుగా ఈ గుడ్ న్యూస్ ని తన తల్లితో పంచుకున్నాడట. అయితే మొదట్లో ఎవరూ నమ్మలేదని అతను చెప్పాడు. ఆ తర్వాత అదంతా కూడా నిజమేనని అందరూ గ్రహించారు.ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లాటరీని గెలుచుకున్న తర్వాత కూడా స్టీవ్ తన వృత్తిని విడిచిపెట్టకుండా ఇప్పటికీ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: