విశ్వరూపం సృష్టించబోతున్న భానుడు.. పిల్లలు, పెద్దలు తస్మాత్ జాగ్రత్త..!
ఇకపోతే రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది అని.. కృష్ణ, గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలలో తీవ్రమైన వేడి గాలులతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకూడదని కూడా సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు, పెద్దలు ఈ వాతావరణంలో బయట తిరగకపోవడమే మంచిది అని చెబుతున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ కోస్తా మాత్రం నిప్పుల కొలిమిలా మారిపోయింది ఎండవేడికి ప్రజలు పూర్తిస్థాయిలో అల్లాడిపోతున్నారు. ఇకపోతే కృష్ణ , గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో మొత్తం 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానన్న 48 గంటల్లో ఎండలు మరింతగా పెరిగే పరిస్థితిలు ఏర్పడుతున్న నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రాకూడదు అని.. ప్రయాణాలు తప్పని పరిస్థితిలో తప్ప చేయకూడదు అని కూడా చెబుతున్నారు. ఇక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్టుగానే ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిది.