రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వ..!!
మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాలో జొన్నలు రాగులు పంపిణీ చేస్తున్నారని పిడిఎఫ్ ద్వారా పేదలకు కూడా పౌష్టికార ఉత్పత్తులను అందించాలని లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పౌరసరాఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను కూడా సేకరించగా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్సిఐ ద్వారా రాగులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. అలాగే రైతుల వేసిన పంటను కూడా ఏపీ సర్కార్ కొనుగోలు చేయడంతో పాటు చిరుధాన్యాలు ఎలా పండించాలని అవగాహన కూడా కల్పిస్తున్నట్లు సమాచారం.
మొదట రాయలసీమ జిల్లాలలో రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నారని ఈ పంపిణీ విజయవంతం అయితే రాష్ట్రమంతటా కూడా చిరుధాన్యాల పంపిణీ అమలు చేస్తామని ప్రభుత్వం తెలుపుతోంది. కేంద్రం కూడా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రజల ఆరోగ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా బియ్యం కంటే రాగులు జొన్నలు పౌష్టికాహారంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం చిరుధాన్యాలను కొనుగోలుక అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి అందుకే ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీ చేయబోతోందని తెలుస్తోంది. గోధుమపిండి కిలో రూ .16 రూపాయలు కంది బ్యాలెన్స్ సబ్సిడీ కింద రూ .67 రూపాయలు అందిస్తున్నట్లు సమాచారం.