కింగ్ కోబ్రాను రౌండప్ చేసిన కాకులు.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వీడియోలలో అటు కింగ్ కోబ్రా వీడియో ఏదైనా ఉంది అంటే చాలు నెటిజెన్స్ అన్ని పనులు పక్కనపెట్టి ఆ వీడియోను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎంతోమంది స్నేక్ క్యాచర్లు ఎంతో చాకచక్యంగా కింగ్ కోబ్రాలను పట్టుకోవడం లాంటి వీడియోలు కూడా ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉన్నాయి. ఇక మరికొన్ని సందర్భాల్లో ముంగిస, కింగ్ కోబ్రా కి మధ్య భీకరమైన ఫైట్ జరగడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలోకి వస్తూ ఉన్నాయి.

 ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో ఇప్పుడు వరకు మీరు కనీ విని ఎరుగనిది అని చెప్పాలి. ఏకంగా మట్టి రోడ్డుపై ఉన్న ఒక కింగ్ కొబ్రా పదికి పైగా కాకులను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసేసాయి. ఇక ఆ తర్వాత ఆ కింగ్ కోబ్రాపై ఒకదాని తర్వాత ఒకటి దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇక వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే కింగ్ కోబ్రా మట్టి రోడ్డును దాటుతుంది. అదే సమయంలో ఓ కాకుల గుంపు అక్కడికి వచ్చింది. ఒక్కసారిగా పామును రౌండప్ చేసేసాయి కాకులు.

 ఇక ఆ కాకుల నుంచి తప్పించుకునేందుకు కింగ్ కోబ్రా పడగ విప్పి దాడి చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా ఆ కాకుల గుంపు రెచ్చిపోయింది. ఒకదాని తర్వాత మరొకటి కింగ్ కోబ్రా పై దాడి చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఆ పాము హడలిపోయింది. వాటి భారీ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. చివరికి కాకులు వాటి ముక్కుతో గుచ్చడంతో ఆ పాముకు రక్తం కారింది. దీంతో నిస్సహాయ స్థితిలో పడిపోయింది ఆ పాము. ఇక ఆ తర్వాత పాములో కదలికలు లేవు అని గమనించిన కాకుల గుంపు అక్కడ నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియో వైరల్ గా మారగా.. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: