వైరల్ : పామును పట్టుకున్న యువతి.. ఎలా వణికిపోయిందో చూడండి?

frame వైరల్ : పామును పట్టుకున్న యువతి.. ఎలా వణికిపోయిందో చూడండి?

praveen
సాధారణంగా మేకపోతు గాంభీర్యం అనే పదం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. మేకపోతు గాంబీర్యం అంటే లోలోపల ఎంత భయం ఉన్నప్పటికీ అటు బయటకి మాత్రం తాము చాలా ధైర్యవంతులం అని చూపించుకునేందుకు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పాముల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు అని  చెప్పాలి. సాధారణంగానే పాములు అంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ పాములంటే మాకు అసలే భయం లేదు ఎంతో సులభంగా చేతులతోనే పట్టేస్తాం అన్నట్లుగా ఫోజ్ కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు చాలామంది.


 కానీ ఒక్కసారి కళ్ళ ముందు పాము కనిపించింది అంటే చాలు భయంతో వనికి పోవడం కూడా చూస్తూ ఉంటాం. అయితే పామును నేరుగా చూడడానికి భయపడిపోయే జనాలు.. అటు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయిన పాము వీడియోలను చూడడానికి మాత్రం తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది సాహసం చేయరా డింభకా అనే మాటతో ప్రేరణ పొంది ఏకంగా పాములను పట్టుకోవడానికి వాటితో ఫోటోలు దిగడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఓ యువతి కూడా ఇలాంటిదే చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు.



 ఆ యువతీకి కొత్తగా పెళ్లయినట్టుంది. భర్తతో కలిసి సరదాగా టూర్ కి వెళ్ళింది. ఈ క్రమంలోనే కంటికి కనిపించే వింతలన్నీ చూస్తూ వెళ్తుంది. ఇంతలో ఆమెకు ఒకచోట పాములు కనిపించాయి. అవన్నీ పెంపుడు పాములు. అయితే ధర చెల్లించి కాసేపు పట్టుకుని వాటితో ఫోటో దిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ యువతి మదిలో ఎలాంటి ఆలోచన మిగిలిందో కానీ ఎంతో ధైర్యంగా పామును పట్టుకునేందుకు సిద్ధమైంది. కానీ ఆ తర్వాత పాముని ఆమె చేతిలో పెట్టగానే ఒక్కసారిగా గజగజ వనికిపోయింది. కానీ పైకి ధైర్యాన్ని నటించేందుకు ప్రయత్నించింది. దీంతో ఇలా సదరు యువతీ ఒకవైపు ధైర్యం నటిస్తూనే లోలోపల భయపడటం చూసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: