ఈ బుడ్డోడికి భయం లేదా.. కొండచిలువపై ఎక్కి స్విమ్మింగ్ చేస్తున్నాడు?

praveen
ప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడ ఇలాంటి వింతైన ఘటన జరిగిన కూడా అదే సోషల్ మీడియాలో వెంటనే ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని వీడియోలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మరికొన్ని బాగా నవ్విస్తూ ఉంటాయి. మరికొన్ని భయాన్ని పుట్టిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాను ఊపేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు ఒక భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇది చూసి నేటిజన్స్ అందరూ కూడా నోరెళ్ళ పెడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా భారీ కొండచిలువ నీళ్లల్లో ఈదుతూ కనిపించిందంటే చాలు అటువైపు వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా వనికి పోతూ ఉంటారు. ఎందుకంటే ప్రాణాల మీద ఆశ లేని వారే కొండచిలువతో ఆటలు ఆడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఒకవేళ పొరపాటున కొండచిలువతో ఆటలు ఆడితే ఏం జరుగుతుంది అన్న విషయం ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోల ద్వారా అందరికీ అర్థమైంది.

 అయితే ఇలా కొండచిలువను చూస్తేనే అందరూ భయపడి పోతే ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం కొండచిలువపై ఎక్కి నీళ్లలో ఈదుతూ ఉన్నాడు. దీంతో ఇది చూసి ఆ బుడ్డోడికి భయం అంటే తెలియదా అని ఎంతోమంది నేటిజన్స్ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. పసుపు రంగులో 15 అడుగుల కంటే ఎక్కువ పొడువు ఉన్న ఒక భారీ కొండచిలువ మీద బుడ్డోడు తోక పట్టుకుని వెనకాల ఈదుతూ కనిపిస్తూ ఉన్నాడు. ఈ వీడియో కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: