దారుణం: కాలిపోతున్న కారులో గర్భిణీతో భర్త మృతి?

Purushottham Vinay
ఎంత దారుణం? ఎంత ఘోరం? దేవుడికి మనసే లేదా? అనిపించే సంఘటన జరిగింది. ఈ సంఘటన తెలిస్తే ఖచ్చితంగా కన్నీళ్లు వస్తాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండుగర్భిణీ అయిన భార్యను కారులో ఆసుపత్రికి తరలిస్తున్నాడు ఆమె భర్త. ఇంతలో ఆ కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భార్యతోపాటు భర్త కూడా ఆ కారులోనే మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు.కేరళ రాష్ట్రంలో గురువారం నాడు ఈ ఘోరమైన విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ మృతులను కన్నూర్‌ జిల్లా కుత్తియాత్తూరుకు చెందిన ప్రిజిత్ (35) ఇంకా అతని భార్య రీషా (26)గా గుర్తించారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ మహిళ రీషాను 2020 మోడల్ మారుతి ఎస్-ప్రెస్సో కారులో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ఈ ఘోరాతి ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఐతే వాహనంలో సడెన్ గా మంటలు చెలరేగడంతో వెనుక సీట్లో కూర్చున్న చిన్నారితో సహా నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకొని బయటకు దూకారు. కారు ముందు భాగంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో కార్ డోర్లు ఓపెన్‌కాలేదు.


దీంతో ముందు సీట్లో కూర్చున్న ప్రిజిత్-రీషా కారులోనే పాపం ఇరుక్కుపోయారు. స్థానికులు పరుగుపరుగున వచ్చి కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎంత ప్రయత్నించినా కూడా అసలు ఫలితం లేకపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ మంటలను అదుపుచేసి, ప్రిజిత్, రీషాలను బయటకు తీశారు. ఐతే అప్పటికే వారు కాలిపోయి మృతి చెందినట్లు గుర్తించారు. మృతులతో సహా గాయాలపాలైన నలుగురిని కూడా అక్కడ ఆసుపత్రికి తరలించినట్లు కన్నూర్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అజిత్‌ కుమార్‌ మీడియాకు తెలియజేశారు.ఇక సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాత అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించగలమని ఆయన వెల్లడించారు.ఏది ఏమైనా ఇది నరకం లాంటి చావు అని చెప్పాలి. ఒక పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఆ తల్లి.. తన భార్యని పుట్టబోయే బిడ్డని బ్రతికించుకోవాలని తాపత్రయ పడ్డ ఆ వ్యక్తిని మృత్యువు చాలా దారుణంగా కాటు వేసింది. వారి ఆత్మలకు శాంతి కలిగి వారి కుటుంబానికి దేవుడు శక్తినివ్వాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: