ఎలాంటి రక్షణ లేకుండానే.. నిమిషంలో పామును పట్టేసిన యువతి?
ఈ క్రమంలోనే ఇక ఇటీవల కాలంలో ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇటీవల కొంతమంది స్నేక్ క్యాచర్లు ఎంతో అలవోకగా విషపూరితమైన పాములను పట్టుకుంటున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒక యువతి ఏకంగా ఎంతో చాకచక్యంగా నాగుపామును పట్టుకుని డబ్బాలో బంధించిన వీడియో చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
సాధారణంగా స్నేక్ క్యాచర్లు ఒక స్టిక్ పట్టుకొని విషపూరితమైన పాములను ఎంతో కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యువతి మాత్రం ఎలాంటి రక్షణ లేకుండానే కనీసం చేతిలో కర్ర పట్టుకోకుండానే పామును బంధించేసింది. ముందుగా పాము తోకను పట్టుకుంది. ఇక ఆ పాము పడగవిపి బుసలు కొడుతున్న భయపడలేదు. తర్వాత ఒక డబ్బాలోకి పాము వెళ్లేలా చేసింది. తర్వాత ఎంతో చాకచక్యంగా డబ్బా మూత పెట్టింది. ఇదంతా వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.