వైరల్ : వెర్రి వెయ్యి రకాలు.. ఇది కూడా ఒక రకమే?
ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ఇంటర్నెట్ ను షేర్ చేసింది అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పాపులారిటీ అవ్వాలనుకోవడం బాగానే ఉంది. కానీ ఇలాంటి పిచ్చి పనులు ఏంటో అంటూ నెటిజెన్స్ ఈ వీడియో చూసి అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు అపర్ణ దేవ్యాల్ అనే ఒక మహిళ ఇలాంటి పనే చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా మెట్రో ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా సరే ఇక సీట్లో కూర్చొని మొబైల్లో మునిగిపోవడం లేదా తోటి ప్రయాణికులతో మాట్లాడటం లాంటివి చేస్తూ ఉంటారు.
కాగా ఇక్కడ యువతి మాత్రం మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తూ ఏకంగా మధ్యలో హ్యాండ్ హోల్డింగ్స్ ని గట్టిగా పట్టుకొని ఇక అటు ఇటు ఊయల ఊగడం లాంటి వెక్కిలి చేష్టలు చేసింది. అంతేకాదు సీట్లపై కూర్చుని బోర్డుపై తనను మోసుకెళ్లే మృదువైన బొమ్మతో ఫోజులు ఇవ్వడం లాంటివి చేసింది. ఇలా చిత్రవిచిత్రంగా ప్రవర్తించి ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంట్లో ప్లేస్ లేదా తల్లి ఏకంగా మెట్రోలోకి వచ్చి ఆడుకుంటున్నావ్ అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.